Share News

Parenting: నలుగురిలో పిల్లలను తిడుతున్నారా? ఈ పర్యవసానాలు తప్పవు..!

ABN , Publish Date - Sep 19 , 2024 | 01:09 PM

పిల్లలను పెంచడంలో భాగంగా వారిని తిట్టడం, కొట్టడం సహజం. అయితే పిల్లలను నలుగురిలో తిట్టడం, కొట్టడం చేస్తే దారుణమైన పర్యవసానాలు తప్పవు.

Parenting: నలుగురిలో పిల్లలను తిడుతున్నారా? ఈ పర్యవసానాలు తప్పవు..!
Parenting

పిల్లల పెంపకం ఓ కళ అంటారు. పిల్లలకు మంచి చెడ్డలు నేర్పిస్తూ క్రమశిక్షణగా పెంచుతూనే వారికి ప్రేమను పంచాల్సి ఉంటుంది. సాధారణంగా చిన్నతనం అనేది అల్లరితో ఎక్కువ నిండి ఉంటుంది. పిల్లలకు ఎవరిముందు అల్లరి చేయవచ్చు, ఎవరి ముందు అల్లరి చేయకూడదు? ఎప్పుడు ఎలా మెలగాలి అనేది తెలియదు. ఈ కారణంగా నలుగురిలో ఉన్నప్పుడు కూడా వారు సహజంగా వారి అల్లరి పనులను కొనసాగిస్తూ ఉంటారు. అయితే పిల్లలు నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో నేర్పించాల్సింది పోయి కొందరు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పట్ల కోపం చేసుకుంటారు. నలుగురిలోనే పిల్లలను తిడుతుంటారు. అయితే పిల్లలను నలుగురిలో తిడితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో పేరెంటింగ్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..

Health Tips: ఈ 3 రకాల డ్రై ఫ్రూట్స్ ను తేనెలో నానబెట్టి తినండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!


  • తల్లిదండ్రులు పిల్లలను బయటి వ్యక్తుల ముందు తిట్టడం, అరవడం, కొట్టడం వంటివి చేసినప్పుడు అది పిల్లల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. నలుగురిలో పిల్లలను తిడితే పిల్లలు నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడతారు.

  • నలుగురిలో పిల్లలను తిడుతూ ఉంటే పిల్లల ప్రవర్తన చెడుగా మారుతుంది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో పిల్లలను తిడితే అది పిల్లల దృష్టిలో తల్లిదండ్రుల మీద చెడ్డ అభిప్రాయం ఏర్పడుతుంది. తల్లిదండ్రుల మీద పిల్లలలో కోపం, చిరాకు, నిస్పృహ కలుగుతాయి.

  • బయటి వ్యక్తుల ముందు పిల్లలను తిడితే పిల్లలు క్రమశిక్షణ లేనివారుగా తయారవుతారు. పెరిగే కొద్ది పిల్లలు తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా, గౌరవం లేకుండా ప్రవర్తిస్తారు. ఎక్కువ మంది ముందు పిల్లలను తిడితే అది పిల్లలలో అభద్రతా భావాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. దీని కారణంగా పిల్లలలో సామాజిక నైపుణ్యాలు, సామాజిక సంబంధాలు క్షీణిస్తాయి.

Health tips: బ్రేక్ఫాస్ట్ మిస్ చేస్తే జరిగేదేంటి? మీకు తెలియని నిజాలివీ..!



  • బయటి వ్యక్తుల ముందు పిల్లలను తిడితే అది పిల్లల పైన మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కుటుంబంలో మిగిలిన వారు నిస్సహాయంగా చూస్తూ ఉండటం లేదా అడ్డు వెళ్లడం వంటివి జరుగుతాయి. దీనివల్ల మొత్తం కుటుంబ సభ్యుల మద్య బంధాలు దెబ్బతింటాయి.

పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి?

పిల్లల తప్పులకు పిల్లలను ఎప్పుడూ తిట్టకూడదు. పిల్లలు చేసిన తప్పులను ప్రేమగా దగ్గర కూర్చోబెట్టుకుని వివరించాలి. తల్లిదండ్రులుగా పిల్లలను నలుగురిలో మెచ్చుకోవాలి, పిల్లల ప్రతిభను నలుగురికి చెప్పాలి, వారిని నలుగురిలో ప్రోత్సహించాలి. ఇలా ఉంటే పిల్లల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఇది పిల్లల భవిష్యత్తుకు, వారు చదువులోనూ, అభిరుచులలోనూ రాణించడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి..

ఇష్టపడే రంగును బట్టి మనుషుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?

కివి పండును ఎవరు తింటే మంచిదో తెలుసా?

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 19 , 2024 | 01:26 PM