ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లి వాంతికి చేసుకున్న రోగి.. తీరా ఏం బయటపడిందో చూసి అంతా షాక్..

ABN, Publish Date - Apr 04 , 2024 | 09:19 PM

వివిధ రకాల సమస్యలతో ఆస్పత్రికి వెళ్లే రోగులు.. కొన్నిసార్లు వైద్యులకే షాక్ ఇస్తుంటారు. సమస్య పరిష్కార నిమిత్తం వివిధ రకాల వైద్య పరీక్షలు చేయగా.. చివరకు షాకింగ్ దృశ్యాలు కనిపించిన సందర్భాలను చాలా చూశాం. కడుపు నుంచి...

ప్రతీకాత్మక చిత్రం

వివిధ రకాల సమస్యలతో ఆస్పత్రికి వెళ్లే రోగులు.. కొన్నిసార్లు వైద్యులకే షాక్ ఇస్తుంటారు. సమస్య పరిష్కార నిమిత్తం వివిధ రకాల వైద్య పరీక్షలు చేయగా.. చివరకు షాకింగ్ దృశ్యాలు కనిపించిన సందర్భాలను చాలా చూశాం. కడుపు నుంచి ఇనుప వస్తువులు, కాటన్ బండిల్స్, చెవి నుంచి పాములు.. ఇలా వింత వింత ఆపరేషన్లు చేసిన ఘటనలు గతంలో చాలా జరిగిన విషయం తెలిసిందే. తాజాగా, ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది. కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన రోగి.. ట్రీట్‪‌మెంట్ చేయకుండానే వాంతి చేసుకున్నాడు. తీరా ఏం బయటపడిందో చూసి అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తికి ఉదయమే పొత్తి కడుపునొప్పి (stomach ache) రావడంతో కంగారుగా ఆస్పత్రికి వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లీ వెళ్లగానే వాంతికి వచ్చినట్లు అనిపించింది. వైద్యులు ఎలాంటి పరీక్షలు చేయకుండానే అతను అక్కడే వాంతికి చేసుకున్నాడు. అయితే కడుపు నుంచి ప్రాణంతో ఉన్న పొడవాటి నులి పురుగు (worm) బయటికి వచ్చింది. దీన్ని చూసి వైద్యులతో పాటూ అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అతన్ని విచారించగా.. అంతకు ముందు రోజు పడుకునే ముందు సదరు వ్యక్తి.. వైద్యులు ఇచ్చిన నులిపురుగుల మందును తీసుకున్నట్లు తెలిసింది.

Viral Video: వివాహాల్లో భోజనాల వద్ద.. ఇలాంటి ఏర్పాట్లు ఎప్పుడైనా చూశారా.. ఐడియా అదుర్స్ అంటున్న నెటిజన్లు..

చాలా కాలం తర్వాత అతను నులిపురుగులకు సంబంధించిన మందును తీసుకున్నట్లు తెలిసింది. పురుగులు బయటికి రావడం వల్ల అతడి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందీ లేదని వైద్యులు తెలిపారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో్..! ఇంత పొడవున్న పురుగును ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘చిన్న తనంలో మాకూ ఇలాగే జరిగింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 26 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆపదలో ఉన్న వారిని కాపాడటానికి దేవుడే రానక్కర్లేదు.. కొన్నిసార్లు ఇలాక్కూడా జరుగుతుంది..

Updated Date - Apr 04 , 2024 | 09:19 PM

Advertising
Advertising