Viral: రహదారిపై క్రాష్ ల్యాండింగ్.. రెండు ముక్కలైన విమానం!
ABN, Publish Date - Dec 12 , 2024 | 10:09 PM
దక్షిణ టెక్సాస్‌లో బుధవారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తేలికపాటి విమానం ఒకటి హైవేపై క్రాష్ ల్యాండయ్యి రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ టెక్సాస్‌లో బుధవారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తేలికపాటి విమానం ఒకటి హైవేపై క్రాష్ ల్యాండయ్యి రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. బిజీ రహదారిపై ఈ ప్రమాదం జరిగినా ఎవరూ మృతి చెందకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు (Viral).
Musk - Gates: అదే జరిగితే.. బిల్ గేట్స్ దివాలా తీస్తారు: ఎలాన్ మస్క్
విక్టోరియాలోని స్టేట్ హైవే లూప్ 463 వద్ద మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యానని పేర్కొన్నారు. ప్రమాదానికి ముందు విమానం తక్కువ ఎత్తులో ప్రయాణించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానం అంత తక్కువ ఎత్తులో ప్రయాణించడం చూసి తాము ఆశ్చర్యపోయామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ‘‘ఈ దృశ్యం చూడటానికి భయానకంగా ఉంది. ప్రమాద తీవ్రత పెరగనందుకు మేము చాలా అదృష్టవంతులం’’ అని ఓ వ్యక్తి అన్నారు. ప్రమాదం తరువాత అపస్మారక స్థితిలో విమానంలో చిక్కుకుపోయి ఉన్న పైలట్‌ను తాను చూశానని మరో వ్యక్తి చెప్పారు. ఆయనను బయటకు తీసేందుకు ప్రయత్నించినా కుదరలేదని అన్నారు.
Viral: యాచకుడిలా నటించిన వ్లాగర్ ! రోజంతా భిక్షాటనతో ఎంతొచ్చిందంటే..
కాగా, ప్రమాదం జరిగిన విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సిబ్బంది క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. చెల్లాచెదురుగా పడ్డ విమాన శకలాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అయితే, విమానం క్రాష్ అవడానికి కారణాలు ఏంటో మాత్రం ఇంకా తెలియరాలేదు. ఘటనపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు ప్రారంభించనుంది.
Updated Date - Dec 12 , 2024 | 10:09 PM