Viral News: గూగుల్ మ్యాప్స్ తప్పిదం.. గోవా వెళ్లే కారు కాస్తా ఫారెస్టుకు..
ABN , Publish Date - Dec 08 , 2024 | 10:32 AM
ఇటివల గూగుల్ మ్యాప్స్ మరికొంత మందిని చిక్కుల్లో పడేసింది. బీహార్ నుంచి గోవాకు కారులో వెళ్లేందుకు ఓ ఫ్యామిలీ గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని బయలుదేరగా, వారిని ఓ ఫారెస్టుకు పోయేలా చేసింది. దీంతో ఆ ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఇటివల కాలంలో అనేక మంది ఎక్కడికి వెళ్లలన్నా కూడా గూగుల్ మ్యాప్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇది అప్పుడప్పుడు తప్పు మార్గాలను చూపించి ఇబ్బందుల్లో పడేస్తుంది. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. బీహార్ నుంచి గోవాకు కారులో వెళ్తున్న ఓ కుటుంబానికి గూగుల్ మ్యాప్స్ తప్పు రూట్ చూపించడం వల్ల వల్ల రాత్రంతా ఇబ్బందులు పడ్డారు. ఆ క్రమంలో దట్టమైన అడవుల్లోకి వెళ్లి చిక్కుకున్నారు. నావిగేషన్ కోసం వీళ్లు గూగుల్ మ్యాప్స్ సహాయం తీసుకున్నారు. కర్నాటకలోని బెలగావి జిల్లాకు చేరుకున్న తర్వాత, అప్లికేషన్ వారికి ఒక చిన్న మార్గాన్ని చూపించింది.
అడవిలోకి రూట్
అది ఖాన్‌పూర్‌లోని దట్టమైన భీమ్‌ఘర్ అడవి గుండా వెళుతుంది. 8 కిలోమీటర్లు లోపలికి వెళ్లాక వారికి అది పొరపాటు అని అర్థమైంది. ఆ క్రమంలో కారు దట్టమైన అడవికి చేరుకున్నాక ఫోన్ నెట్ వర్క్ కూడా తగ్గిపోయింది. దీంతో వారు చేసేదేమి లేక రాత్రంతా అడవిలో గడిపారు. తెల్లవారుజామున నిద్రలేచిన కుటుంబం నెట్‌వర్క్ కోసం నాలుగు కిలోమీటర్లు నడిచినట్లు పేర్కొన్నారు. ఆ క్రమంలో ఓ చోట నెట్ వర్క్ సౌకర్యం లభించగా వెంటనే ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ 112ను సంప్రదించారు. అప్పుడు పోలీసులు వచ్చి వారిని అడవి నుంచి బయటకు తీసుకొచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ అడవి ప్రమాదకరమైన వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందినదని పేర్కొన్నారు.
పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం
గత నెలలో కూడా గూగుల్ మ్యాప్స్ కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. గూగుల్ మ్యాప్స్ వారి కారుకు తప్పు దారి చూపడంతో మ్యాప్‌ల ప్రకారం నిర్మాణంలో ఉన్న వంతెనపై కారు తప్పుగా దూసుకెళ్లింది. దీంతో వారి కారు నదిలో పడి, కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఓ పెళ్లికి హాజరయ్యేందుకు గురుగ్రామ్ నుంచి బరేలీ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పెళ్లి వేదిక వద్దకు చేరుకోవడానికి గూగుల్ మ్యాప్స్ సాయం తీసుకున్నారు. అప్పుడు వారి GPS అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్ వద్దకు తీసుకెళ్లింది. ఆ క్రమంలో కారు బ్రిడ్జిపైకి వెళ్లగా 50 అడుగుల ఎత్తు నుంచి కారు రామగంగా నదిలో పడిపోయింది.
కామెంట్లు
ఇది తెలిసిన నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. తప్పుడు మార్గాన్ని చూపించిన గూగుల్ మ్యాప్స్ సంస్థపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. పలువురి మరణాలకు కారణమైన దీనిపై ప్రభుత్వం కూడా కఠిన చట్టాలు అమలు చేయాలని చెబుతున్నారు. అయితే ఈ ఘటనలపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.
ఇవి కూడా చదవండి:
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More National News and Latest Telugu News