Viral Video: రోడ్డుపై రిక్షాను చూసి పరుగెత్తుకుంటూ వెళ్లిన పోలీసు.. చివరకు ఎంత పని చేశాడంటే..
ABN, Publish Date - Jan 28 , 2024 | 03:42 PM
పోలీసులను చూస్తేనే చాలా మంది భయపడిపోతుంటారు. ఎక్కడ లేనిపోని కేసుల్లో ఇరికించి జైలుకు తీసుకెళ్తారో అని చాలా మంది వారిని చూడగానే ఆమడదూరం పారిపోతుంటారు. అయితే ...
పోలీసులను చూస్తేనే చాలా మంది భయపడిపోతుంటారు. ఎక్కడ లేనిపోని కేసుల్లో ఇరికించి జైలుకు తీసుకెళ్తారో అని చాలా మంది వారిని చూడగానే ఆమడదూరం పారిపోతుంటారు. అయితే పోలీసులు అంతా అలాగే ఉంటారని అనుకోవడానికి లేదు. వారిలోనూ చాలా మంది మంచి మనసున్న పోలీసులు కూడా ఉంటారు. కొందరు ఎదుటి వారి కష్టం చూసి చలించిపోతుంటారు. ఈ క్రమంలో తమకు చేతనైన సాయం చేసి, అందరితో శభాష్.. అనిపించుకుంటుంటారు. ఇలాంటి పోలీసులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతంది. రిక్షాను తోసుకుంటూ వెళ్తున్న వ్యాపారిని చూసి ఓ పోలీసు చలించిపోయాడు. చివరకు ఏం చేశాడో మీరే చూడండి..
సోషల్ మీడియలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వాహనాల రాకపోకలతో రద్దీగా బ్రిడ్జిపై ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంటుంది. ఓ వ్యక్తి రిక్షాపై (rickshaw) ఇనుప కడ్డీలు తదితర సమాన్లు వేసుకుని వెళ్తుంటాడు. అయితే బ్రిడ్జి వద్దకు వచ్చేటప్పటికే బాగా అలసిపోయి ఉంటాడు. దీనికితోడు బ్రిడ్జిపై రోడ్డు ఎత్తుగా ఉండడం వల్ల రిక్షాను లాగడం కష్టమవుతుంది. అయినా ఎవరూ అతడికి సాయం చేసేందుకు ముందుకు రారు. ఎవరి బిజీలో వారు వెళ్లిపోతుంటారు. అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ పోలీసు.. అతన్ని గమనిస్తాడు.
వ్యాపారి కష్టపడుతుండడాన్ని గమనించి.. వెంటనే బైకు పక్కన ఆపి, పరుగెత్తుకుంటూ వ్యాపారి వద్దకు వెళ్తాడు. రిక్షాను వెనుక నుంచి (policeman helped the rickshaw puller) తోస్తూ అతడికి సాయం చేస్తాడు. ఇలా బ్రిడ్జి దాటే వరకు అతడి రిక్షాను తోసి సాయం చేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పోలీసును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘‘ఈ పోలీసుది ఎంత మంచి మనసు’’.. అంటూ కొందరు, ‘‘ఈ పోలీసును మిగాతా పోలీసులు ఆదర్శంగా తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, ‘‘మీరు చాలా గ్రేట్ బ్రదర్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 31వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
ఈ 10 పక్షులు యమా డేంజర్.. పాములను కూడా తినగలవు..
Updated Date - Jan 28 , 2024 | 03:42 PM