Viral: కడుపుతో ఉండి కూడా ఇదేంటి తల్లీ.. మహిళ పనికి షాక్‌లో నెటిజన్లు!
ABN, Publish Date - Jun 29 , 2024 | 03:37 PM
కడుపుతో ఉండికూడా ఓ మహిళ సోషల్ మీడియా వీడియోల కోసం డ్యాన్స్ చేయడాన్ని నెటిజన్లు విపరీతంగా విమర్శిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, సోషల్ మీడియా జమానాలో తమ జీవితంలో ప్రతి అంశాన్ని ఫాలోవర్లతో పంచుకోవాలన్న అభిలాష జనాలుకు ఎక్కువైంది. ఫలితంగా ప్రెగ్నెన్సీ రివీల్ వీడియోలు కూడా అనేకం వెలుగు చూస్తున్నాయి. అయితే, ఓ మహిళ సోషల్ మీడియా రీల్స్ కోసం చేసిన పని జనాలకు అసలేమాత్రం నచ్చలేదు. దీంతో, విమర్శలు వెల్లువెత్తాయి. మహిళ తీరు నెట్టింట చర్చనీయాంశమైంది (Viral).
Viral: సుధామూర్తి చెప్పిన జీవిత సత్యం! యువత పెళ్లికి ముందే ఇది తెలుసుకోవాలి!
కడుపుతో ఉన్న ఓ యువతి ఇన్‌స్టా రీల్ కోసం తెగ డ్యాన్స్ చేసింది. గర్భంతో ఉన్నప్పటికీ హుషారుగా స్టెప్పులేస్తూ జనాలను అలరించే ప్రయత్నం చేసింది. ఆమె ఊహించినట్టుగానే ఈ వీడియో విపరీతంగా వైరల్ అయిపోయింది. ఏకంగా 31 లక్షల వరకూ వ్యూస్ వచ్చిపడ్డాయి. లైకులు కూడా అంచనాలకు మించాయి. అయితే, ఆమె ఊహించని విధంగా కొందరు జనాలు ఆమెపై విపరీతంగా ట్రోల్ చేశారు.
నెట్టింట అనేక మంది మహిళపై విమర్శలు గుప్పించారు. కడుపులో బిడ్డ ఆరోగ్యంపై కనీసం శ్రద్ధ లేకుండా ఇలా డ్యాన్సులు చేయొచ్చా అని మండిపడ్డారు. సోషల్ మీడియా మాయలో పడ్డ నేటి యువత మంచీచెడూ గుర్తించలేకపోతోందని మండిపడ్డారు. గర్భవతి వయ్యుండీ ఇలా చేయొచ్చా అంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, మహిళ మాత్రం తన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. డాక్టర్ల సూచన తీసుకున్నాకే ఇలా చేస్తున్నానని స్పష్టం చేసింది. వైద్యులు తనను ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండమన్నారని చెప్పుకొచ్చింది. అయినా జనాల విమర్శలు మాత్రం తగ్గలేదు. దీంతో, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Updated Date - Jun 29 , 2024 | 03:43 PM