Psychological Games: పురుషులు మహిళలపై ప్రయోగించే మైండ్ గేమ్స్ ఇవే!
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:31 PM
భార్యభర్తలు, లవర్స్ మధ్య మైండ్ గేమ్స్ సర్వసాధారణమని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి, ప్రేమించే వారితో ఇలాంటి ఆటలు సబబేనా అన్న ప్రశ్న కలగొచ్చు. మనసుకుండే కొన్ని లక్షణాలే ఈ దిశగా మనుషులను వారికి తెలీకుండానే ప్రేరేపిస్తాయట.
ఇంటర్నెట్ డెస్క్: భార్యాభర్తలు, లవర్స్ మధ్య మైండ్ గేమ్స్ సర్వసాధారణమని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి, ప్రేమించే వారితో ఇలాంటి ఆటలు సబబేనా అన్న ప్రశ్న కలగొచ్చు. మనసుకుండే కొన్ని లక్షణాలే ఈ దిశగా మనుషులను వారికి తెలీకుండానే ప్రేరేపిస్తాయట. ప్రతి పురుషుడు జీవితభాగస్వామి మెప్పు, మద్దతు కోరుకుంటారు. తమను ఆర్థం చేసుకోవాలని ఆశిస్తారు. ఈ క్రమంలో తాము కోరుకుంటున్నవి అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు అసంకల్పితంగా ఇలాంటి మైండ్ గేమ్స్‌కు తెరలేపుతారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు (Relationships).
Kitchen: వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఈ మార్పులు తప్పనిసరి!
కొందరు పురుషులు తమ జీవితభాగస్వామి లేదా లవర్ ముందే మరో స్త్రీతో చనువుగా ఉన్నట్టు ప్రవర్తిస్తుంటారు. తద్వారా తమ జీవితభాగస్వామి రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారట. తను వేరే మహిళతో చనువుగా ఉంటే చూసి భార్య లేదా లవర్ ఈర్ష్య పడుతోందా, పొసెసివ్‌గా ఫీలవుతోందా అని గమనిస్తారట. జీవితభాగస్వామికి తనపై ఎంత ఇష్టం ఉందో తెలుసుకునేందుకు ఇలా పరోక్ష పద్ధతిలో చెక్ చేసుకుంటారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కొందరు భాగస్వామికి దూరంగా, అంటీముట్టనట్టుగా ఉంటూ మైండ్ గేమ్ ఆడతారు. ఇలాంటి సందర్భాల్లో భాగస్వామి తన వెంట పడుతుంటే ఆమెకు తనపై ఎంతో ఇష్టమని భావిస్తారట. కావాల్సిన ప్రైవసీ ఇస్తోందా ఆమెకు తనమై నమ్మకం ఉందని అనుకుంటారట.
Washing White Clothes: ఈ టెక్నిక్స్‌తో తెల్ల దుస్తులపై పాత మరకలు మాయం!
ఇంటి విషయాల్లో నిర్ణయాధికారం ఉండే కొన్ని సందర్భాల్లో పురుషులు ఆ బాధ్యతలన్నీ జీవితభాగ్వామికి వదిలేస్తారు. తద్వారా జీవితభాగస్వామి కొత్త సవాళ్లు, పరిస్థితులకు అనుగూణంగా తనని తాను మార్చుకోగలదో లేదో పరోక్షంగా చెక్ చేస్తారని నిపుణులు చెబుతున్నారు.
కొందరు పురుషులు తమ లవర్స్‌ను కుటుంబసభ్యులు, ఇతర స్నేహితులకు పరిచయం చేసి పరీక్ష పెడుతుంటారు. తనకు నచ్చిన వారితో ఆమె కలుపుగోలుగా ఉండగలదో లేదో చెక్ చేసేందుకు ఇలా చేస్తారు. సామాజిక బంధాలను ఎలా హ్యాండిల్ చేస్తోందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారట. తద్వారా ఓ వ్యక్తి తనకు సరిజోడేనా అన్న విషయాన్ని పురుషులు అంచనా వేస్తారని నిపుణులు చెబుతున్నారు.
Viral: ఏం ఐడియా బ్రో.. గుళ్లల్లో చెప్పులు చోరీ కాకుండా ఉండేందుకు భలే చిట్కా!