Chicken: పనీర్ బిర్యానీలో చికెన్.. మా మత విశ్వాసాలు దెబ్బతిన్నాయన్న కస్టమర్.. జొమాటో రియాక్షన్ ఏంటంటే..
ABN, Publish Date - May 16 , 2024 | 01:00 PM
పుణెకు చెందిన ఓ వ్యక్తికి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ``జొమాటో`` కారణంగా తీవ్ర అసౌకర్యం ఎదురైంది. ఆ వ్యక్తి ఇటీవల పనీర్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఇంటికి వచ్చిన ఫుడ్ పార్శిల్ విప్పి ప్లేట్‌లో వేసుకుని తింటుండగా ఆ బిర్యానీలో చికెన్ పీస్ కనిపించింది. దీంతో ఆ వ్యక్తి షాకయ్యాడు.
పుణె (Pune)కు చెందిన ఓ వ్యక్తికి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ``జొమాటో`` (Zomato) కారణంగా తీవ్ర అసౌకర్యం ఎదురైంది. ఆ వ్యక్తి ఇటీవల పనీర్ బిర్యానీ (Paneer biryani) ఆర్డర్ చేశాడు. ఇంటికి వచ్చిన ఫుడ్ పార్శిల్ విప్పి ప్లేట్‌లో వేసుకుని తింటుండగా ఆ బిర్యానీలో చికెన్ పీస్ కనిపించింది (Chicken in paneer biryani). దీంతో ఆ వ్యక్తి షాకయ్యాడు. తనకెదురైన అసౌకర్యం గురించి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. ఆ వ్యక్తి ఫిర్యాదుపై జొమాటో కస్టమర్ కేర్ విభాగం స్పందించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది (Viral News).
పుణెకు చెందిన పంకజ్ శుక్లా అనే వ్యక్తి తనకెదురైన ట్వీట్ చేశాడు. ``పీకే బిర్యానీ హౌస్ నుంచి నేను పనీర్ బిర్యానీ ఆర్డర్ చేశాను. అందులో నాకు చికెన్ పీస్ కనిపించింది. నాకు పూర్తి రిఫండ్ వచ్చింది. కానీ, పూర్తి శాకాహారినైన నేను మా మత నియమాల ప్రకారం పాపం చేసినట్టే భావిస్తున్నాను. మా మత విశ్వాసం దెబ్బతిన్నట్టే అనుకుంటున్నా`` అంటూ ట్వీట్ చేశాడు. పంకజ్ ట్వీట్‌పై జొమాటో కస్టమర్ కేర్ విభాగం స్పందించింది.
``హాయ్ పంకజ్. ఎవరి విశ్వాసాలను దెబ్బతీయకూడదనేదే మా నియమం. దానికే మా మొదటి ప్రాధాన్యం. మీ ఆర్డర్ ఐడీ, రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ మాకు డీఎమ్ చేయండి. ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరుపుతాం`` అని జొమాటో రిప్లై ఇచ్చింది. ఈ ఘటనపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: డీజిల్‌తో పరాటా చేయడం చూశారా? వైరల్ వీడియోపై రెస్టారెంట్ ఓనర్ రియాక్షన్ ఏంటంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 16 , 2024 | 01:00 PM