Viral Video: ఎవర్రా మీరంతా.. వర్షం నీటిని కూడా వదలరా?.. నడిరోడ్డు మీద ఈ పనులేంటి?
ABN, Publish Date - Jun 08 , 2024 | 12:17 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. ఏదో ఒక వెరైటీ వీడియోను రూపొందించి పోస్ట్ చేసెయ్యాలని పరితపించిపోతున్నారు. వ్యూస్, లైక్స్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఇతరులకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తిస్తున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. ఏదో ఒక వెరైటీ వీడియోను రూపొందించి పోస్ట్ చేసెయ్యాలని పరితపించిపోతున్నారు. వ్యూస్, లైక్స్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఇతరులకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అసలే వర్షం (Rain) పడితే రోడ్ల మీద ప్రయాణించడానికి ఇబ్బంది అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఓ యువకుడి నిర్వాకం చాలా మందికి ఆగ్రహం తెప్పిస్తోంది (Viral Video).
mipunekar.in అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను పుణె (Pune)లోని ఎరవాడ ప్రాంతంలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రోడ్డుపై నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ నీటిపై ఓ యువకుడు తెల్లటి చాపపై పడుకుని సర్ఫింగ్ చేస్తున్నాడు (Man Surfing on rain water). రోడ్డుపై ప్రవహించే నీటితో పాటు చాప కూడా ముందుకు వెళుతోంది. దానిపై ఆ యువకుడు హాయిగా సేదతీరుతున్నాడు. రోడ్డుపై వెళుతున్న వాహనాలకు చేయి ఊపుతూ పక్కకు జరగమని అడుగుతున్నాడు.
ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. అతడు బిజీ రోడ్డుపై అలా సర్ఫింగ్ చేస్తుంటే అతడి స్నేహితులు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 47 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ``అదే రూట్‌లో బస్సు, లారీ వెళితే సర్ఫింగ్ బాగుంటుంది``, ``వర్షం పడినపుడు పుణె చాలా ఎకో ఫ్రెండ్లీగా మారుతుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Anand Mahindra: ఫొటోకు ఫన్నీ క్యాప్షన్ అడిగిన ఆనంద్ మహీంద్రా.. విజేతకు ఏం గిఫ్ట్ ఇచ్చారంటే..!
Optical Illusion: మీ కళ్లకు టెస్ట్.. ఈ ఫొటోలో స్ట్రాబెరీ ఎక్కడుందో 8 సెకెన్లలో కనిపెట్టండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 08 , 2024 | 12:17 PM