ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఇళ్ల ముందు రంగు సీసాలను వేలాడదీసిన ప్రజలు.. ఈ ట్రిక్ వల్ల ప్రయోజనం ఏంటని అడిగితే.. షాకింగ్ రిప్లై..

ABN, Publish Date - Jan 02 , 2024 | 03:55 PM

కొత్త ఇళ్లు నిర్మించగానే ఎవరి దిష్టీ పడకుండా ముందు వైపు దిష్టిబొమ్మలు తగిలించడం సర్వసాధారణంగా అంతా చేసే పనే. ఇంకొందరు తమ ఇళ్ల పరిసరాలను ఎవరూ అపరిశుభ్రం చేయకుండా దేవుళ్ల ఫొటోలు తగిలించడం, పాత చెప్పులను వేలాడదీయడం చేస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే...

కొత్త ఇళ్లు నిర్మించగానే ఎవరి దిష్టీ పడకుండా ముందు వైపు దిష్టిబొమ్మలు తగిలించడం సర్వసాధారణంగా అంతా చేసే పనే. ఇంకొందరు తమ ఇళ్ల పరిసరాలను ఎవరూ అపరిశుభ్రం చేయకుండా దేవుళ్ల ఫొటోలు తగిలించడం, పాత చెప్పులను వేలాడదీయడం చేస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే... పంజాబ్‌లోని ఓ గ్రామంలో అంతా తమ ఇళ్ల ముందు నీలి రంగు సీసాలను వేలాడదీశారు. ఈ ట్రిక్ దేనికని వారిని అడగ్గా.. వారు చెప్పిన సమాధానం ఏంటంటే..

సోషల్ మీడియాలో పంజాబ్‌లోని (Punjab) ఓ గ్రామానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు (Viral Video) తెగ వైరల్ అవుతున్నాయి. గ్రామంలోకి వెళ్లిన ఓ వ్యక్తికి షాకింగ్ దృశ్యం కనిపించింది. ఊర్లోని వారంతా తమ ఇళ్ల ముందు నీలిరంగు సీసాలను (Blue bottles) వేలాడదీయడం చూసి సదరు వ్యక్తి అవాక్కయ్యాడు. ముందు ఎలాంటి సందేహం రాకున్నా.. చాలా ఇళ్ల బయట ఇలాగే సీసాలను వేలాడదీయడం చూసి చివరకు గ్రామస్తులను అడిగాడు. నీలిరంగు బాటిళ్లు వేలాడదీయడం వల్ల ప్రయోజనం ఏంటని అడగ్గా.. వింత సమాధానం వచ్చింది.

Viral Video: పెళ్లిలో తాళి కట్టే ముందు వధువు చేయాల్సిన పనిని.. వరుడు చేయడంతో.. ఏం జరిగిందో చూడండి..

వీధి కుక్కలు ఇళ్ల సమీపానికి రాకుండా ఉండడంతో పాటూ మలవిసర్జన చేయకుండా ఇలా చేశామని చెప్పారు. నీలిరంగు బాటిళ్ల ట్రిక్ బాగా పని చేసిందని, అప్పటి నుంచి వీధి కుక్కలు దూరంగా ఉన్నాయని తెలిపారు. కుక్కలు రాకపోవడానికి, బాటిళ్లు వేలాడదీయడానికి సంబంధం ఏంటని అడగ్గా.. దీనిపై ఎవరికీ క్లారిటీ లేదు. కానీ ఈ ట్రిక్ పని చేయడంతో అంతా ఇలాగే చేస్తున్నట్లు చెప్పారు. మొత్తానికి ఈ గ్రామానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదేంటీ మరీ వింతగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వంద నోటు దొరికిందని సంబరపడ్డాడు.. తీరా చేతిలోకి తీసుకుని చూడగా.. షాకింగ్ సీన్..

">

Updated Date - Jan 02 , 2024 | 03:55 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising