Russia: ఆఫీసుల్లో శృంగారంలో పాల్గొనండి.. రష్యా అధ్యక్షుడి కొత్త సూచన!
ABN, Publish Date - Sep 17 , 2024 | 06:38 PM
రష్యాలో నానాటికీ పడిపోతున్న జననాల రేటుతో బెంబేలెత్తిపోతున్న అధ్యక్షుడు పుతిన్ కీలక సూచన చేశారు. పనిలో బిజీగా గడిపేవారు భోజనం, టీ బ్రేక్స్ సందర్భంగా శృంగారంలో పాల్గొని పిల్లల్ని కనాలని సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యాలో (Russia) నానాటికీ పడిపోతున్న జననాల రేటుతో బెంబేలెత్తిపోతున్న అధ్యక్షుడు పుతిన్.. ప్రజలు పిల్లల్ని కనాలని మరోసారి అభ్యర్థించారు. ఉద్యోగాల్లో తీరిక లేకుండా గడుపుతున్నామంటూ పిల్లల్ని కనడాన్ని వాయిదా వేయొద్దని సూచించారు. పనిలో బిజీబిజీగా ఉండే వాళ్లు భోజన సమయం, సాయంత్రాలు కాఫీలు తాగేటప్పుడు శృంగారంలో పాల్గొని బిడ్డల్ని కనాలని సూచించారు. జనాభా పెంచి దేశాన్ని కాపాడాలని కోరారు. (Viral).
Viral: పొట్టపై సాలీడు కుడితే ఇంత ప్రమాదమా! ఇతడికి ఏమైందో తెలిస్తే..
‘‘రష్యా ప్రజల్ని కాపాడుకోవడానికే ప్రస్తుతం తొలి ప్రాధాన్యత. రష్యన్ల జనాభాపైనే దేశ భవిత ఆధారపడి ఉంది’’ అని ఆయన అన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. జనాభా సుస్థిరత కోసం జననాల రేటు 2.1 ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అయితే రష్యాలో మాత్రం ఈ రేటు 1.5కు పడిపోయింది.
Viral: బోను తాళాన్ని పళ్లతో విరగ్గొట్టిన పులి.. చూస్తే గూస్ బంప్స్ పక్కా!
రష్యా ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఇదే సూచనను చేశారు. ‘‘పనిలో తీరిక లేదంటూ పిల్లల్ని కనట్లేదని చెప్పడం సబబు కాదు. లంచ్ బ్రేక్స్, టీ బ్రేక్స్‌లో శృంగారంలో పాల్గొని సంతానభాగ్యం పొందండి. లేకపోతే జీవితం చూస్తుండగానే గడిచిపోతుంది’’ అని పేర్కొన్నారు.
Viral: తల్లి ఇంట్లో లేకపోతే ఇంతే.. పిల్లలను రిస్క్‌లో పడేసిన తండ్రి!
జననాల రేటు పెంచేందుకు రష్యా ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తోంది. 18 నుంచి 40 ఏళ్ల మహిళలను తమ గర్భధారణ సామర్థ్యాన్ని అంచనా వేసుకునేందుకు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తోంది. ఉద్యోగులు పిల్లల్ని కనేలా కంపెనీలను ప్రోత్సహించేందుకు ఓ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు పార్లమెంటు సభ్యుడొకరు తెలిపారు. ఒక్కో ప్రాంతంలో జననాల రేటు పెంచేందుకు అక్కడి గవర్నర్లకు బాధ్యత అప్పగించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.
Viral: వామ్మో.. వీఐపీ బాత్రూమ్‌లంట! రూ.1000! షాక్‌లో కస్టమర్లు!
పిల్లల్ని కనాలని అనేక మంది రాజకీయ నాయకులు మహిళలకు పిలుపునిస్తున్నారు. ‘‘మీరు 19 - 20 ఏళ్ల వయసు నుంచే పిల్లల్ని కనడం ప్రారంభించాలి. అప్పుడు ఒక్కో కుటుంబంలో కనీసం ముగ్గురు, నలుగురు పిల్లలు ఉంటారు. పిల్లల్ని కనడం మహిళల బాధ్యత’’ అని తెలిపారు. రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 24 ఏళ్ల లోపున్న యువతులు తొలిసారి పిల్లల్ని కంటే భారీగా నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. మరోవైపు, ఆబార్షన్‌లపై ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. కుటుంబాలు కూలిపోకుండా డైవర్స్ ఫీజులను కూడా ప్రభుత్వం పెంచుతోంది.
Viral: విమానం ఎంట్రీ డోర్స్ ఎడమ వైపే ఎందుకుంటాయో తెలుసా?
పిల్లల్ని కనాలంటూ ప్రజలను ఇంతలా అభ్యర్థిస్తున్న పుతిన్ మాత్రం తన సంతానం ఎంత మందనే విషయాన్ని ఎప్పుడూ బహిరంగంగా చెప్పలేదు. అధికారికంగా ఆయనకు మరియా (39), కాటరీనా (37) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే, ఆయనకు ఏడు, ఐదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె కూడా ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.
Viral: ఈ రక్తం ధర లీటరుకు రూ.12 లక్షలు! ఇంత ఖరీదు ఎందుకో తెలిస్తే..
Updated Date - Sep 17 , 2024 | 06:49 PM