ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: చెత్త ఏరుకునే యువకుడి సంపాదన నెలకు రూ.1.5 లక్షలు.. షాక్‌లో జనాలు!

ABN, Publish Date - Sep 20 , 2024 | 04:33 PM

చెత్త ఏరుకునే ఓ యువకుడు నెలకు రూ. లక్షన్నర సంపాదిస్తున్నాడని తెలిసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా షాకైపోతున్నారు. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని అనేక అంతర్జాతీయ సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. ఇది సమాజానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నాయి. అయితే, చెత్త ఏరుకునే ఓ యువకుడి సంపాదన చూసి ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే కుళ్లుకుంటున్నారు. తమ చదువులు ఎందుకని ప్రశ్నిస్తు్న్నారు. అసలే మాత్రం చదువుకోని వ్యక్తి కేవలం చెత్త ఏరుకుంటూ ఎలా సంపాదిస్తున్నాడని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.

TamilNadu: మహిళా కస్టమర్ తిట్లు.. డెలివరీ ఏజెంట్ ఆత్మహత్య!


నోయిడాలో ఈ ఘటన వెలుగు చూసింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, తొలుత నాయిడాలోని ఓ వ్యక్తి.. చెత్త ఏరుకుంటున్న ఓ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అతడి చేతిలో ఖరీదైన సిగరెట్ ప్యాకెట్ ఉండటమే ఇందుకు కారణం. దాని ధరను ఉన్నతోద్యోగులు కూడా భరించలేరు. అలాంటి చెత్త ఏరుకునే వ్యక్తికి అదెలా వచ్చిందో తెలీక నెత్తిబాదుకున్నాడు. చివరకు కుతూహలం అణుచుకోలేక అడిగేశాడు (Ragpicker earns one and half lakh monthly netizens are puzzled).

Anand Mahindra: మానవాళికి ఎలాన్ మస్క్ ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్! ఆనంద్ మహీంద్రా ప్రశంస!

తాను చెత్త ఏరుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నానని, రోజుకు కనీసం రూ.5 వేలు కళ్లచూస్తానని అతడు చెప్పాడు. దీంతో, ప్రశ్న అడిగిన వ్యక్తి ఒక్కసారిగా దిమ్మెరపోయాడు. రోజుకు రూ.5 వేలు అంటే నెలకు సగటున లక్షన్నర రూపాయలు. ఓ టెకీ జీతం కంటే ఎక్కువ. దీంతో, ఆ వ్యక్తికి నోట మాట రాలేదు.

Russia: ఆఫీసుల్లో శృంగారంలో పాల్గొనండి.. రష్యా అధ్యక్షుడి కొత్త సూచన!


మరోవైపు ఈ ఉదంతం నెట్టింట వైరల్ కావడంతో జనాలు కూడా నోరెళ్లబెడుతున్నారు. తాము ఇన్నేళ్ల పాటు ఇంత ఖర్చు చేసి చదువుకుని సంపాదిస్తున్న మొత్తాన్ని అతడు కేవలం చెత్త ఏరుకుంటూ ఎలా సంపాదిస్తున్నాడని ఆశ్చర్యపోతున్నారు. తమ శ్రమ అంతా వృథాయేనా అని వాపోతున్నారు. కొందరేమో సమాజంలో నెలకొన్న ఆర్థిక అంతరాలపై మౌలిక ప్రశ్నలు కూడా లేవనెత్తారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్ అవుతోంది. జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

Read Latest and Viral News

Updated Date - Sep 20 , 2024 | 04:33 PM