Dog at Taj: ప్రఖ్యాత తాజ్ హోటల్ లాబీలో నిద్రపోతున్న ఆ కుక్క కథ తెలిస్తే.. రతన్ టాటాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
ABN , Publish Date - May 29 , 2024 | 01:13 PM
ముంబైలో చూడదిగన ప్రదేశాల్లో తాజ్‌మహల్ హోటల్ కూడా ఒకటి. అడుగడుగునా రాజరిక ఉట్టిపడేలా నిర్మించిన ఆ కట్టడంలో వ్యాపార దిగ్గజాలు, క్రికెటర్లు, సినిమా స్టార్లు, ఇతర సంపన్నులు సేదతీరుతుంటారు. అంతటి ప్రఖ్యాత తాజ్ హోటల్ లాబీలో ఓ వీధి కుక్క నిద్రపోతుంటుంది.
ముంబైలో చూడదిగన ప్రదేశాల్లో తాజ్‌మహల్ హోటల్ (Taj Mahal Hotel) కూడా ఒకటి. అడుగడుగునా రాజరికం ఉట్టిపడేలా నిర్మించిన ఆ కట్టడంలో వ్యాపార దిగ్గజాలు, క్రికెటర్లు, సినిమా స్టార్లు, ఇతర సంపన్నులు సేదతీరుతుంటారు. అంతటి ప్రఖ్యాత తాజ్ హోటల్ లాబీలో ఓ వీధి కుక్క (Stray Dog) నిద్రపోతుంటుంది. ఆ ఫొటోను ప్రముఖ హెచ్‌ఆర్ నిపుణురాలు రూబీ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు (Dot at Taj). అంతటి ప్రముఖ హోటల్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్న వీధి కుక్కను చూసి ఆమె ఆశ్చర్యపోయారట (Viral News).
``విలాసవంతమైన హోటల్ వద్ద ఆ వీధి ఎందుకు ఉంది`` అని హోటల్ సిబ్బందిని రూబీ ఆరా తీశారట. దీంతో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆ కుక్క పుట్టిన దగ్గర్నుంచి అక్కడే ఉంటోందట. హోటల్ పరిసరాల్లోకి వచ్చిన ఏ మూగజీవాన్ని అయినా ప్రేమగా చూసుకోవాలని రతన్ టాటా (Ratan Tata) ఆదేశించారట. దీంతో ఆ కుక్క కూడా ఆ హోటల్‌లో భాగం అయిపోయిందట. ఆ విషయం తెలుసుకుని తాను ఎంతో ఉద్వేగానికి గురయ్యానని రూబీ పేర్కొన్నారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రతన్ టాటా గొప్ప మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
నిజానికి రతన్ టాటా వీధి కుక్కల పట్ల ఎంతో దయగా ఉంటారు. టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం అయిన బాంబే హౌస్‌లో వీధి కుక్కల కోసం ప్రత్యేకంగా ఓ గదినే కేటాయించారు. అవి ఆడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే రోడ్డుపై ఆగి ఉన్న వాహనాల కింద నిద్రపోయే మూగజీవాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వాహనాలను స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చేటపుడు ఒక్కసారి చూసుకోవాలని రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..