Mosquito Bites: దోమలు కొందరినే ఎక్కువగా ఎందుకు కుడతాయో తెలుసా?
ABN, Publish Date - May 05 , 2024 | 03:16 PM
శరీరం వేడి, శ్వాసలోని బొగ్గుపులుసువాయువు శాతం, దుస్తులు రంగు, శ్వేదం వాసన తదితరాల ఆధారంగా దోమలు కొందరికే ఎక్కువగా టార్గెట్ చేస్తాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మగ దోమలు పూర్తిగా శాకాహారులు. అవి పువ్వుల మకరందాన్ని ఆహారంగా తీసుకుంటాయి. కానీ ఆడ దోమలు అలా కాదు. వాటి పునరుత్పత్తికి మనిషి రక్తం అవసరం. అందుకే ఆడదోమలు మాత్రమే మనుషుల్ని కుడుతుంటాయి. అయితే, ఆడ దొమలు కొందరినే ఎక్కువగా టార్గెట్ చేస్తాయని శాస్త్రవేత్తలు (Science) చెబుతున్నారు. దీని వెనక పలు కారణాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు.
శాస్త్రవేత్తలు చెప్పే దాని ప్రకారం, దోమలు మనుషుల్ని కళ్లతో పాటు వాటి తలపై ఉండే యాంటీనాలతో గుర్తిస్తాయి. మనిషి శరీరపు వేడి, మనిషి శ్వాసలోని బొగ్గుపులుసు వాయువు, తేమ, శరీరపు వాసన వంటి సంకేతాలను ఆధారంగా ఎవరిని కుట్టాలో నిర్ణయిస్తాయి. ఫలితంగా కొందరిని దోమలు ఎక్కువగా కుడుతుంటాయి (Reasons why mosquitos bite some people more than others).
Viral: ట్రాఫిక్‌లో జాంలో ఇరుక్కున్నప్పుడు ఈ పొరపాటు మాత్రం చేయొద్దు.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో!
దోమలు ముదురు రంగు దుస్తులు వేసుకున్న వారివైపు అధికంగా ఆకర్షితమవుతాయి. అంతేకాకుండా ఫుల్ స్లీవ్స్ కంటే హాఫ్ స్లీవ్స్ షర్టులు ధరించిన వారికే ఎక్కువగా కుడతాయి.
ఓ బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కుడతాయనేందుకు కూడా శాస్త్రపరమైన ఆధారాలు ఉన్నాయి. ఈ బ్లడ్ గ్రూప్‌కు సంబంధించి చర్మంలో ఉండే ప్రత్యేకమైన రసాయనాల కారణంగా ఇలా జరుగుతుందట.
దొమల యాంటెనాలు వేడిని గుర్తిస్తాయి. ఉష్ణోగ్రతల మధ్య 1 డిగ్రీ సెల్సియస్ తేడా వరకూ అవి ఈజీగా గుర్తిస్తాయి. కాబట్టి ఒంటిపై వేడి ఎక్కువగా ఉండేవారికి అవి ఈజీగా టార్గెట్ చేస్తాయి.
శరీరంలో జీవక్రియలు ఎక్కువగా జరిగితే శ్వాసలో బొగ్గుపులుసు వాయువు అధికంగా ఉంటుంది. దీన్ని దోమల యాంటెనాలు గుర్తిస్తాయి. కాబట్టి, శ్వాసలో కార్బన్ డైయాక్సైడ్ ఎక్కువగా విడుదల చేసే వారికి అవి టార్గెట్ చేస్తుంటాయి.
ప్రతి మనిషి చర్మంపై బ్యా్క్టీరియా ఉంటుంది. ప్రతి మనిషి శ్వేదం దేనికదే ప్రత్యేకం. కాబట్టి, దోమలు కొన్ని రకాల వాసనలకు అధికంగా ఆకర్షితమై కొందరినే ఎక్కువగా కుడుతుంటాయి.
గర్భంతో ఉన్నప్పుడు శరీరంలో జీవిక్రియలు వేగవంతమవుతాయి. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా గర్భిణులకు దోమల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
మద్యపానం కూడా శరీర ఉష్ణోగ్రత పెంచి దోమలకు టార్గెట్‌గా మారేలా చేస్తుంది. కాబట్టి, ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటే దోమల బెడద ఉండదు.
Updated Date - May 05 , 2024 | 03:19 PM