ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Relationship: ఈ 3 పొరపాట్లు ఎప్పుడూ చేయకండి.. ఎంత ప్రేమగా ఉన్న భార్యాభర్తలను అయినా విడదీస్తాయివి..!

ABN, Publish Date - Aug 16 , 2024 | 01:51 PM

భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో ఈ బంధంలో గొడవలు రావడం కూడా అంతే సాధారణం. చాలా వరకు గొడవలు వస్తే కొంత సమయం లేదా కొన్ని రోజులలో అవి పరిష్కారం అయిపోతాయి. కానీ భార్యాభర్తలు చేసే 3 పొరపాట్లు మాత్రం

Relationship

ప్రపంచంలో భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకం. రెండు వేర్వేరు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు కలసి ఒక్కటిగా జీవించడం ఈ బంధంలో ఉన్న గొప్పదనం. కష్టం, సుఖం, బాధ, సంతోషం ఇలా.. ప్రతి దాంట్లో ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు. అయితే భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో ఈ బంధంలో గొడవలు రావడం కూడా అంతే సాధారణం. చాలా వరకు గొడవలు వస్తే కొంత సమయం లేదా కొన్ని రోజులలో అవి పరిష్కారం అయిపోతాయి. కానీ భార్యాభర్తలు చేసే 3 పొరపాట్లు మాత్రం ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా ఉన్న భార్యాభర్తలను అయినా విడిపోయేలా చేస్తాయట. అవేంటో తెలుసుకుంటే..

త్రివర్ణ పతాక రూపకర్త.. పింగళి వెంకయ్య గురించి ఈ నిజాలు తెలుసా..?


అహంకారం..

మనిషిలో అహంకారం ఏ బంధాన్ని అయినా విచ్చిన్నం చేస్తుంది. అయితే భార్యాభర్తల బంధంలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం అనుకుని కలసి ఉండాల్సిన వాళ్ల మధ్య నేను, నాది అనే పదాలు బంధాన్ని చాలా బలహీనం చేస్తాయి. ఈ నేను, నాది అనే మాటలు ఎప్పుడూ సంబంధంలోకి రాకుండా ఉంటే భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది.

ఆవేశం..

కొందరికి ఆవేశం ఎక్కువ. ఇతరులతో ఏదైనా ఆర్గ్యూ లాంటిది జరుగుతున్నప్పుడు తమను ఎదుటివాళ్లు తప్పు పడతారు, తమలో తప్పులు బయటకు తీస్తారనే ఉద్దేశ్యంతో ముందుగానే ఎదురుదాడికి దిగుతారు. అయితే ఇలా ఎదుటివారు ఏం చెప్తున్నారనే ఆలోచన చేయకుండా ఆవేశంతో మాట్లాడితే చాలా నష్టం. బయటివారితో మాట్లాడితే ఆర్థిక నష్టాలు, అపార్థాలు ఏర్పడతాయేమో కానీ.. భార్యాభర్తలు ఇలా చేస్తే మాత్రం వారి బంధం ఎక్కువ కాలం పదిలంగా ఉండదు.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీరు తాగితే జరిగేది ఇదే..!


కమ్యూనికేషన్ ఆగిపోవడం..

స్నేహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు , బంధువులు కావచ్చు.. అప్పుడప్పుడు అయినా పలకరించుకుంటూ ఉంటే వారి మధ్య పరిచయాలు అలాగే ఉంటాయి. లేకపోతే కొన్ని రోజులలోనే ఎవరి లైఫ్ వారిది అయిపోతుంది. అలాంటిది జీవితాంతం కలసి ఉండాల్సిన భార్యాభర్తలు కమ్యునికేషన్ చేసుకోకుంటే వారి మధ్య దూరం పెరుగుతుంది. ఏదైనా గొడవ జరిగినప్పుడు భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడటం మానేయడానికి బదులు ఇద్దరూ కలసి కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలి.

ఆడవారిలో ఈ 8 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!

టీతో రస్క్ తినే అలవాటు ఉందా? ఈ నిజాలు తెలిస్తే..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 16 , 2024 | 01:51 PM

Advertising
Advertising
<