ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Relationship: భార్యాభర్తలు రాత్రి సమయంలో ఈ విషయాలు తప్పనిసరిగా మాట్లాడుకోవాలట..!

ABN, Publish Date - May 24 , 2024 | 02:06 PM

ఒకరికొకరు దగ్గరగా కూర్చుని మాట్లాడుకోవాలి అంటే ఇప్పటి భార్యాభర్తలకు రాత్రి సమయమే సరైనది. భార్యాభర్తలిద్దరూ తమకు ఏకాంతంగా దొరికే రాత్రి సమయంలో 5 విషయాలు తప్పనిసరిగా మాట్లాడాలని , ఇలా మాట్లాడుకోవడం వల్ల ఒకరికొకరు మరింత దగ్గరవుతారని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు.

ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఒక జంటగా ముడిపడ్డాక వారి జీవితాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక ఇప్పటికాలం వారికి ఉద్యోగాల కారణంగా మాట్లాడుకోవడానికి తగినంత సమయం ఉండదు. ఒకరికొకరు దగ్గరగా కూర్చుని మాట్లాడుకోవాలి అంటే ఇప్పటి భార్యాభర్తలకు రాత్రి సమయమే సరైనది. భార్యాభర్తలిద్దరూ తమకు ఏకాంతంగా దొరికే రాత్రి సమయంలో 5 విషయాలు తప్పనిసరిగా మాట్లాడాలని , ఇలా మాట్లాడుకోవడం వల్ల ఒకరికొకరు మరింత దగ్గరవుతారని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..

ప్రేమ..

ప్రేమ వివాహం అయినా, పెద్దలు కుదిర్చిన వివాహం అయినా ఇద్దరి మధ్య ప్రేమ ఉండటం తప్పనిసరి. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిమీద మరొకరికి ప్రేమ కలిగిన సందర్భాల గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడు, ఎలా ప్రేమ కలిగిందో ఓపెన్ గా చెప్పుకోవడం వల్ల ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. ఒకరిమీద ఒకరికి ఉన్న ఇష్టాన్ని తెలుసుకున్న తరువాత ఇద్దరి మధ్య ఏవైనా అపార్థాలు, అనుమానాలు ఉన్నా అవన్నీ ప్రేమ ముందు తేలిపోతాయి.

ఖాళీ కడుపుతో పొరపాటున కూడా తినకూడని ఆహారాలు ఇవి..!


మార్పు..

ఇద్దరు ఒక్కటయ్యాక జీవితంలో వచ్చిన మార్పేంటి? అనే విషయాలు చర్చించుకోవాలి. ఈ చర్చలో మంచి, చెడు రెండూ ఉండవచ్చు. అయితే మంచిని, చెడును తెలుసుకోవడం ద్వారా తాము ఏ విషయాలు సరిచేసుకుంటే జీవితం ఆశాజనకంగా ఉంటుందో అర్థం అవుతుంది.

బలాలు..

ప్రతి సంబంధంలోనూ బలాలు, బలహీనతలు ఉంటాయి. ఇద్దరు వేర్వేరు వ్యక్తులు జంటగా మారిన తరువాత ఇద్దరి బలాలు ఏంటి? ఒక్కరిగా ఉన్నప్పటికీ, జంటగా మారినప్పటికీ ఇద్దరి బలాలు ఎలా మెరుగుపడ్డాయి అనే విషయాన్ని చర్చిస్తే ఇద్దరికీ ఒకరికొకరు ఎంత ముఖ్యమో.. ఒకరినొకరు ఎంత అర్థం చేసుకున్నారో అర్థం అవుతుంది.

భోజనం తరువాత ఓ చిన్న బెల్లం ముక్క తింటే ఏం జరుగుతుందంటే..!


మెరుగుదల..

మెరుగుపడటం అనేది అన్ని విషయాలలోనూ మంచిదే. ముఖ్యంగా భార్యాభర్తల బంధం ఎంత మెరుగుపడితే వారి మధ్య అనుబంధం అంత ఆరోగ్యకరంగా ఉంటుంది. బంధం విషయంలో మెరుగుపరుచుకోవలసిన విషయాలు ఏంటో ఒకరితో ఒకరు చర్చించడం ముఖ్యం. ఏ విషయాలు మార్చుకుంటే ఇద్దరూ సంతోషంగా ఉండగలుగుతారు అనేది తెలుసుకోవాలి.

భవిష్యత్తు..

భవిష్యత్తు ప్రణాళికలు లేని బంధం అంటూ ఉండదు. భవిష్యత్తు గురించి ఆలోచనలు, వాటికోసం ప్రణాళికలు, సాధ్యాసాధ్యాలు.. ఇలా అన్నింటిని అడిగి తెలుసుకోవడం, ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల భవిష్యత్తుకు సంబంధించిన విషయాలలో ఇద్దరూ కలిసి సహకరించుకోవచ్చు.

బాదం బంక ఎప్పుడైనా తిన్నారా? వేసవిలో దీన్ని తింటే ఎన్ని లాభాలంటే..!

ఖాళీ కడుపుతో పొరపాటున కూడా తినకూడని ఆహారాలు ఇవి..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండిి.

Updated Date - May 24 , 2024 | 02:06 PM

Advertising
Advertising