ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Raksha Bandhan: ఈ రాఖీ వెరీ స్పెషల్ గురూ.. దేశ, విదేశాల్లో భారీ డిమాండ్..

ABN, Publish Date - Aug 19 , 2024 | 08:26 AM

రాఖీ పండుగ వచ్చిందంటే చాలు మార్కెట్లో రకరకాల రాఖీలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం వెండి రాఖీలకు భారీ డిమాండ్ పెరిగింది. రకరకాల ఆకారాలతో రాఖీలు ఆకర్షణీయంగా ఉంటున్నాయి.

Meenakari Rakhi

రాఖీ పండుగ వచ్చిందంటే చాలు మార్కెట్లో రకరకాల రాఖీలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం వెండి రాఖీలకు భారీ డిమాండ్ పెరిగింది. రకరకాల ఆకారాలతో రాఖీలు ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్, సింథటిక్‌తో చేసే రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ప్లాస్టిక్, సింథటిక్ వస్తువులు లేనప్పుడు రాఖీలు ఎలా తయారు చేసేవారో తెలుసా.. ఆ సమయంలో పురాతన చేతివృత్తుల కళాకారులు రాఖీలను తయారుచేసేవారు. ఈ రాఖీలను బంగారం, వెండి, ఖరీదైన రాళ్లతో తయారు చేసేవారు. బెనారస్‌లోని గైఘాట్ ప్రాంతంలో పింక్ ఎనామిల్ పనిలో నైపుణ్యం ఉన్న కళాకారులు ఉంటున్నారు. వారు గత ఐదు వందల సంవత్సరాలుగా ఈ రాఖీలను తయారుచేస్తున్నారు. ఈ రాఖీలు చాలా ఖరీదైనది కావడంతో రానూరానూ వీటి వినియోగం తగ్గిపోయింది. కానీ గత పదేళ్లుగా చేతివృత్తి కళాకారులకు ప్రభుత్వాలు అండగా నిలుస్తూ.. చేతివృత్తి కళలను కాపాడాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుండటంతో ఈ కళ మళ్లీ పుంజుకుంది. 500 ఏళ్ల చరిత్ర ఉన్న మీనాకరి రాఖీలకు ఇప్పటికీ ఎంతో డిమాండ్ ఉంది. బెనారస్‌లో మాత్రమే లభించే ఈ రాఖీలు చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి.


మీనాకరి రాఖీలు..

ఈఏడాది రక్షాబంధన్ సందర్భంగా గులాబీ రంగు మీనాకరితో తయారు చేసిన రాఖీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన ఇరవై ఐదు వేలకు పైగా రాఖీలు బెనారస్ నుండి దేశ, విదేశాలకు వెళ్లాయి. గత మూడు నెలలుగా నిరంతరాయంగా పనిచేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు పదివేలకు పైగా రాఖీలను ఇక్కడి కళాకారులు పంపగలిగాను. దేశంలో ప్రధాన నగరాల నుంచి ఆర్డర్లు వచ్చాయి.అలాగే ఐరోపా, అమెరికా దేశాల నుంచి ఈ రాఖీల కోసం ఆర్డర్లు వచ్చాయి.


తయారీ ఇలా..

మీనాకరి రాఖీలు ఖరీదైనవి కావడంతో ఎవరైనా ఆర్డర్‌ ఇస్తేనే ఇవి తయారుచేస్తారు. పేర్లు, ఖరీదైన రాళ్లతో కూడిన రాఖీలను చాలా మంది ఇష్టపడతారు. ఈ రాఖీలను వెండి, బంగారం పూతతో పాటు ఖరీదైన రాళ్లతో తయారు చేస్తారు. రాళ్లలో, రూబీ, పుష్యరాగం, నీలమణి వంటి వాటిని వినియోగిస్తారు. వీటి ఖరీదు లక్షల్లో ఉంటుంది. రాఖీ పండుగ తర్వాత మీనాకరి రాఖీలను చెవి రింగులు లేదా బ్రాస్‌లైట్‌లుగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. తయారుచేసే సమయంలోనే వినియోగదారుడి అభిరుచి మేరకు తగిన మోడల్‌లో రాఖీని తయారుచేస్తారు. రాఖీ పండుగ తర్వాత వీటిని చెవి రింగు లేదా ఉంగరం, బ్రాస్‌లైట్‌గా మార్చుకునే అవకాశం ఉండటంతో.. ఈ రాఖీలకు ఎక్కువ డిమాండ్ పలుకుతోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telugu Latest News Click Here

Updated Date - Aug 19 , 2024 | 08:26 AM

Advertising
Advertising
<