Viral: కాలిపై పిల్లి రక్కడంతో తెగిన నరం.. తీవ్ర రక్తస్రావమై యజమాని మృతి!
ABN, Publish Date - Nov 28 , 2024 | 10:22 PM
పెంపుడు పిల్లి కాలిపై రక్కడంతో ఓ వ్యక్తి తీవ్ర రక్తస్రావమై మరణించిన అసాధారణ ఘటన రష్యాలో వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: పెంపుడు పిల్లి కాలిపై రక్కడంతో ఓ వ్యక్తి తీవ్ర రక్తస్రావమై మరణించిన అసాధారణ ఘటన రష్యాలో వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఇది పెను కలకలానికి దారి తీసింది (Viral). పూర్తి వివరాల్లోకి వెళితే..
డిమిట్రీ ఉఖిన్ అనే 55 ఏళ్ల వ్యక్తి వద్ద ఓ పెంపుడు పిల్లి ఉంది. కొన్ని రోజుల క్రితం అది ఎక్కడికో వెళ్లిపోయింది. దాని కోసం రోజుల తరబడి తీవ్రంగా వెతికిన డిమిట్రీ ఎట్టకేలకు దాని జాడ కనుక్కుని ఇంటికి తెచ్చుకున్నాడు. అయితే, నవంబర్ 22న సాయంత్రం వేళ పిల్లి అకస్మాత్తుగా డిమిట్రీపై దాడి చేసింది. అతడి కాలిపై రక్కింది. దీంతో, డిమిట్రీకి ఆపలేనంతగా రక్తస్రావమైంది.
Viral: శ్వేతజాతీయురాలిని పెళ్లాడితే డైవర్స్ తప్పదన్నారు..ఎన్నారై వీడియో వైరల్
డిమిట్రీకి అప్పటికే డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. అతడికి బీపీ కూడా ఉంది. పైపెచ్చు పిల్లి దాడిలో కాలి నరం తెగడంతో ధారాపాతంగా రక్త కారసాగింది. అతడి ఆరోగ్య సమస్యల రీత్యా రక్తస్రావాన్ని ఆపడం అతడి వల్ల కాలేదు. చివరకు పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన అతడు వెంటనే పొరుగున ఉన్న తన స్నేహితుడికి సమాచారం అందించాడు.
Viral: యువతులతో కలిసి ఏనుగు భరతనాట్యం! జరిగింది తెలిస్తే కన్నీళ్లు ఆగవ్!
డిమిట్రీ స్నేహితుడు అత్యవసర సిబ్బందికి తక్షణం సమాచారం అందించాడు. డిమిట్రీ కాలి నుంచి రక్తం ధారాపాతంగా కారుతోందని, ఆపలేకపోతున్నామని చెప్పాడు. వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే అతడు మృతి చెందాడు. పిల్లి దాడి చేసిన సమయంలో అతడి భార్య కూడా ఇంట్లో లేదు.
అయితే, తమ పెంపుడు పిల్లి అకస్మాత్తుగా ఎందుకిలా దాడి చేసిందో తమకు అర్థం కాలేదని డిమిట్రీ భార్య వాపోయింది. అయితే, ఆ పిల్లిని పెంచుకునేదీ లేనిదీ మాత్రం ఆమె వెల్లడించలేదు. మరోవైపు, ఆరోగ్య సమస్యల కారణంగా రక్తస్రావం అధికమై డిమిట్రీ మృతిచెందినప్పటికీ పోస్టు మార్టం తరువాతే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు, డిమిట్రీ అనూహ్య మరణం స్థానికంగా పెద్ద చర్చనీయాంశం అయ్యింది.
Viral: రూ.6,015 కోట్లను చెత్తలో పారేసిన గర్ల్‌ఫ్రెండ్! జరిగిందేంటో తెలిస్తే..
Viral: ఈ ఆడ ఏనుగు కష్టం చూస్తే గుండె తరుక్కుపోతుంది! ఎంతైనా తల్లి కదా..
Updated Date - Nov 28 , 2024 | 10:32 PM