Viral: వామ్మో.. రాక్షస డైనోసార్ మళ్లీ పుడుతోందా.. చైనాలో దొరికిన గుడ్లను పరిశీలించగా ఏం తెలిసిందంటే..
ABN, Publish Date - Oct 24 , 2024 | 11:42 AM
సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఆగ్నేయ చైనాలోని గన్‌జౌ సమీపంలోని ఓ నిర్మాణ స్థలంలో ఆరు చిన్న చిన్న గుడ్లు బయటపడ్డాయి. రాళ్ల కుప్పల మధ్యలో ఈ గుడ్లను గుర్తించారు. వీటిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి..
డైనోసార్ పేరు వింటేనే భయంతో వణికిపోతాం. సినిమాల్లో పెద్ద పెద్ద డైనాసార్లు మనుషులపై ఎలా దాడులు చేస్తుంటాయో చూస్తుంటాం. మరి అలాంటి డైనోసార్లు నిజ జీవింతంలోకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. భయంతో చెమటలు పడుతున్నాయి కదా. వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్లు.. జనం మధ్యలోకి వచ్చే అవకాశం లేకపోయినా.. అప్పుడప్పుడూ వాటికి సంబంధించిన గుడ్లు బయటపడడం చూస్తే అలాంటి భయమే కలుగుతుంది. గతంలో చాలా సార్లు డైనోసార్లకు సంబంధించిన గడ్ల శిలాజాలు బయటపడిన విషయం తెలిసిందే. తాజాగా, అత్యంత చిన్న సైజులో ఉండే డైనోసార్ గుడ్లను చైనాలో గుర్తించారు. వీటిని పరిశీలించిన శాస్త్రవేత్తలకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి.
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన చైనాలో (China) చోటు చేసుకుంది. ఆగ్నేయ చైనాలోని గన్‌జౌ సమీపంలోని ఓ నిర్మాణ స్థలంలో ఆరు చిన్న చిన్న గుడ్లు (Dinosaur eggs) బయటపడ్డాయి. రాళ్ల కుప్పల మధ్యలో ఈ గుడ్లను గుర్తించారు. వీటిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి.. ఈ గుడ్లు సుమారు 66 నుంచి 145 మిలియన్ సంవత్సరాల క్రితం క్రెటేషియన్ కాలనికి చెందినవని తేల్చారు.
Viral Video: ఏటీఎంలో డబ్బులు బయటికి రాగానే ఆనందం తట్టుకోలేక.. ఈ యువతి చేసిన నిర్వాకం చూడండి..
ఇప్పటివరకూ చాలా రకాల డైనోసార్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇంత చిన్న సైజులో గుడ్లు బయటపడడం ఇదే తొలిసారి అని నిపుణులు చెబుతున్నారు. ఈ గుడ్డు 1.1 అంగుళాలు (2.9 సెం.మీ.) పొడవు ఉందని చెప్పారు. గతంలో జపాన్‌లో డైనోసార్‌కు సంబంధించిన అతి చిన్న గుడ్డు బయటపడిందన్నారు. గన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఆ గుడ్డు 110 మిలియన్ సంవత్సరాల క్రితం కాలనికి చెందినదని, 1.8 అంగుళాల (5.5 సెం.మీ) పొడవు ఉందని వివరించారు. తాజాగా బయటపడిన డైనోసార్ గుడ్లను గతంలో ఎన్నడూ చూడలేదని, ఇవి నాన్-ఏవియన్ థెరోపాడ్ జాతికి చెందిన డైనోసార్ గుడ్లు అని తెలిపారు.
Viral Video: ఎలాంటి ఎక్స్‌పోజింగ్ లేకున్నా లక్షల్లో వ్యూస్.. ఇంతకీ ఈమె చేసిన పనేంటంటే..
ఇప్పటికీ ఈ గుడ్డులోని పిండం శిలాజం ఏమాత్రం పాడవకుండా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో దక్షిణ చైనాలో సుమారు 7 అంగుళాల పొడవున్న డైనోసార్ గుడ్డును కనుగొన్న విషయం తెలిసిందే. ఈ డైనోసార్ ఓవిరాప్టోరోసార్ జాతికి చెందినదని అప్పట్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. కాగా, ప్రస్తుతం బయటపడిన అత్యంత చిన్న డైనోసార్ గుడ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే అడవి జంతువులకు హడల్.. రైతు తెలివి మామూలుగా లేదుగా..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే అడవి జంతువులకు హడల్.. రైతు తెలివి మామూలుగా లేదుగా..
Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..
Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..
Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Oct 24 , 2024 | 11:42 AM