ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: అపెండిక్స్‌ చేసి కడుపులో కత్తెరలు మరిచిన డాక్టర్.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ

ABN, Publish Date - Oct 19 , 2024 | 07:00 PM

ఓ డాక్టర్ చేసిన చిన్న నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ దాదాపు 12 ఏళ్లుగా కడుపు నొప్పితో ఇబ్బంది పడింది. ఆ క్రమంలో అనేక మంది వైద్యులను కలిసినా కూడా ఆమెకు ఊరట లభించలేదు. అయితే చివరకు ఏమైంది, ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ చుద్దాం.

viral news

అప్పుడప్పుడు వైద్యులు చేసిన చిన్న నిర్లక్ష్యం కారణంగా బాధిత వ్యక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. గతంలో డాక్టర్లు ఆపరేషన్లు చేసిన సమయంలో కడుపులో కాటన్లు సహా చిన్న చిన్న పరికరాలు మరిచిపోవడం వంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ కూడా అచ్చం అలాగే జరిగింది. ఓ మహిళ పొత్తికడుపు నొప్పితో ఆస్పత్రికి రాగా ఆమెకు అపెండిసైటిస్ వచ్చినట్లు తేలింది. దీంతో వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసి ఇంటికి పంపించారు. కానీ ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా ఆ మహిళకు మళ్లీ కడుపు నొప్పి మొదలైంది. నొప్పికి చాలా మంది వైద్యులను సంప్రదించి మందులు తీసుకున్నా కూడా ఉపశమనం లభించలేదు.


కడుపులోనే కత్తెర

ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 8, 2024న ఆమె మళ్లీ STNM ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమెకు ఎక్స్ రే చేయగా తన కడుపులో శస్త్రచికిత్స రెండు కత్తెరలు ఉన్నట్లు గుర్తించి వారు ఆశ్చర్యపోయారు. అనంతరం ఆమెకు ఆపరేషన్ చేసి కడుపులో నుంచి వాటిని వెంటనే బయటకు తీశారు. కానీ వాస్తవానికి 2012లో ఆమెకు తీవ్రమైన కడుపు వస్తే తన ఇంటికి సమీపంలోని సర్ తుతోబ్ నామ్‌గ్యాల్ మెమోరియల్ (STNM) ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ సమయంలో వైద్యులు ఆమెకు అపెండిసైటిస్ శస్త్రచికిత్స చేసి ఇంటికి పంపించారు. కానీ ఆ సమయంలోనే డాక్టర్ రెండు కత్తెరలను ఆమె కడుపులోనే మరిచిపోయాడు.


12 ఏళ్ల తర్వాత

12 ఏళ్ల తర్వాత దానిని మళ్లీ గుర్తించారు. ప్రస్తుతం ఆ మహిళకు ఉపశమనం కలిగింది. కానీ 12 ఏళ్లుగా ఆ మహిళ మాత్రం నొప్పితో ఎంతో ఇబ్బందిపడిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో అనేక ఆస్పత్రులకు వెళ్లినా కూడా వారు తన పరిస్థితిని గుర్తించలేకపోయారు. చివరకు మళ్లీ అదే ఆస్పత్రికి వస్తే కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఈ సంఘటన సిక్కింలో చోటుచేసుకుంది. అయితే ఈ సంఘటన విషయంలో ప్రస్తుతం ఆ మహిళ తమకు ఫిర్యాదు చేయలేదని స్థానిక పోలీసులు తెలిపారు. మహిళ కడుపులో నుంచి వైద్యులు కత్తెరను తొలగించినట్లు విచారణలో తేలింది.


కామెంట్స్

వైద్యుల బృందం మహిళ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. శస్త్రచికిత్స అనంతరం మహిళ పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని తెలిపారు. ఈ విషయం తెలిసిన అనేక మంది మాత్రం ఆ వైద్యుడితోపాటు ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిర్లక్ష్యంగా వైద్యం చేసిన డాక్టర్‌ను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ ఆ మహిళకు ఏదైనా జరిగితే వారి కుటుంబం పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయింది.


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈగలకు తెలీకుండా తేనె చోరీ.. ఇతడి టెక్నిక్ ఏంటో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 19 , 2024 | 09:20 PM