ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన క్యాచ్.. రవీంద్ర జడేజా గాల్లోకి ఎగిరి పట్టిన క్యాచ్ చూడండి..!

ABN, Publish Date - Apr 20 , 2024 | 04:45 PM

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నిఖార్సైన ఆల్ రౌండర్. బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లో కూడా జడేజాకు సాటి లేరు. ప్రస్తుత టీమిండియాలో బెస్ట్ ఫీల్డర్ అంటే రవీంద్ర జడేజా పేరునే చెప్పాలి. ఇప్పటికే ఎన్నో సంచలన క్యాచ్‌లు అందుకున్న జడేజా తాజాగా లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో కళ్లు చెదిరే క్యాచ్ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Ravindra Jadeja Catch

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) నిఖార్సైన ఆల్ రౌండర్. బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లో కూడా జడేజాకు సాటి లేరు. ప్రస్తుత టీమిండియాలో బెస్ట్ ఫీల్డర్ అంటే రవీంద్ర జడేజా పేరునే చెప్పాలి. ఇప్పటికే ఎన్నో సంచలన క్యాచ్‌లు అందుకున్న జడేజా తాజాగా లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో కళ్లు చెదిరే క్యాచ్ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు (Jadeja Catch). తాజాగా లఖ్‌నవూలోని ఏక్నా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి (IPL 2024).


లఖ్‌నవూ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో మతీషా పతిరినా వేసిన తొలి బంతిని కేఎల్ రాహుల్ (KL Rahul) పాయింట్ దిశగా గట్టిగా కొట్టాడు. అది ఫోర్ అనుకున్నారు అందరూ. అయితే జడేజా నమ్మశక్యం కాని రీతిలో గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో ఆ బాల్ అందుకున్నాడు. ఆ క్యాచ్ చూసి రాహుల్‌తో పాటు స్టేడియంలోని అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. ``ఇది క్యాచ్ ఆఫ్ ది ఐపీఎల్ 2024`` అంటూ కామెంటేటర్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. జడేజా (57), ధోనీ (28 నాటౌట్) రాణించారు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన లఖ్‌నవూ 19 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కేఎల్ రాహుల్ (82), డికాక్ (54) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

ఇవి కూడా చదవండి..

MS Dhoni: సూపర్ ఫామ్‌లో ఉన్న ధోనీ ముందుగా ఎందుకు రావడం లేదు? సీక్రెట్ బయటపెట్టిన సీఎస్కే కోచ్!


T20 World Cup: భారత టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో పది మంది ఫిక్స్.. వారికి నో ఛాన్స్!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 20 , 2024 | 04:45 PM

Advertising
Advertising