Viral Video: మట్టి తవ్వుతుండగా బయటపడ్డ విచిత్ర ఆకారం.. తీక్షణంగా పరిశీలించగా.. చివరకు..
ABN, Publish Date - Mar 02 , 2024 | 08:57 PM
గుప్తనిధుల కోసం మట్టి తవ్వుతుండగా కొన్నిసార్లు విచిత్ర వస్తువులు బయటపడిన సందర్భాలను చూశాం. అలాగే పొలం పనుల్లో ఉండగా మట్టిలో పురాతన విగ్రహాలు పడిన సందర్భాలను కూడా చూశాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
గుప్తనిధుల కోసం మట్టి తవ్వుతుండగా కొన్నిసార్లు విచిత్ర వస్తువులు బయటపడిన సందర్భాలను చూశాం. అలాగే పొలం పనుల్లో ఉండగా మట్టిలో పురాతన విగ్రహాలు పడిన సందర్భాలను కూడా చూశాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మట్టి తవ్వుతుండగా ఓ విచిత్ర ఆకారం బయటపడింది. ఏంటా అని చివరకు తీక్షణంగా పరిశీలించి అంతా షాక్ అయ్యారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు మట్టి తవ్వుతుండగా మధ్యలో వారికి ఏదో విచిత్ర ఆకారం ఉన్నట్లు కనిపించింది. దీంతో వారంతా కంగారుతో అది ఏంటో తెలుసుకోవాలని చుట్టూ ఉన్న మట్టిని జాగ్రత్తగా తొలగించారు. ఏదో పెద్ద వింత జీవి ప్రాణంతో ఉండడం చూసి మరింత లోతుగా తవ్వారు. చివరకు తీక్షణంగా పరిశీలించగా.. చాలా తాబేళ్లు (Turtles) ఒకదానిపై మరొకటి రాయిలా పేర్చినట్లు ఉన్నాయి. అందులోనూ అవి ప్రాణంతో ఉండడం చూసి అంతా షాక్ అయ్యారు.
Viral Video: ఈ తల్లి ఎలుగు ప్రేమకు సెల్యూట్ చేయాల్సిందే.. నీళ్లలో పడిన పిల్ల ఎలుగుబంటిని చూసి..
చెరువులు, కుంటల సమీపాల్లో తాబేళ్లు ఇలా మట్టిలో నిద్రావస్థలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఇలాంటి దృశ్యం.. ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘తాబేళ్లన్నీ గోడ కట్టినట్లుగా ఉన్నాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 57 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: బాబోయ్..! ఇదెక్కడి మాయాజాలం.. చూస్తుండగానే అన్నీ మాయం చేసిందిగా..
Updated Date - Mar 02 , 2024 | 08:57 PM