Share News

Viral Video: వడగళ్ల వానకు భయపడ్డ పక్షి.. ఓ ఇంటి డోర్ ముందు నిల్చుని ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్!

ABN , Publish Date - Aug 16 , 2024 | 01:30 PM

భారీ వర్షాలు, గాలులు విరుచుకుపడుతున్నప్పుడు అందరూ ఇబ్బంది పడతారు. మనుషులైతే తమ ఇళ్లలో తలదాచుకుంటారు. జంతువులు వాటి నివాసాల్లో క్షేమంగా ఉంటాయి. అయితే అలాంటి సమయాల్లో పక్షులు ఎక్కువగా ఇబ్బంది పడతాయి. భారీ వర్షాలు, గాలుల కారణంగా వాటి గూళ్లు కూడా దెబ్బతింటాయి.

Viral Video: వడగళ్ల వానకు భయపడ్డ పక్షి.. ఓ ఇంటి డోర్ ముందు నిల్చుని ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్!
Bird

భారీ వర్షాలు, గాలులు విరుచుకుపడుతున్నప్పుడు అందరూ ఇబ్బంది పడతారు. మనుషులైతే తమ ఇళ్లలో తలదాచుకుంటారు. జంతువులు (Animals) వాటి నివాసాల్లో క్షేమంగా ఉంటాయి. అయితే అలాంటి సమయాల్లో పక్షులు ఎక్కువగా ఇబ్బంది పడతాయి. భారీ వర్షాలు, గాలుల కారణంగా వాటి గూళ్లు కూడా దెబ్బతింటాయి. ఇక, వడగళ్ల వర్షం (Rain) పడుతున్నప్పుడు పక్షులకు (Birds) దెబ్బలు కూడా తగులుతాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ పక్షికి అలాంటి సందర్భమే ఎదురైంది. అప్పుడు ఆ పక్షి ఏం చేసిందో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (Viral Video).


@cctvidiots అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో భారీ వర్షం కురుస్తోంది. వర్షంతో పాటు వడగళ్లు కూడా పడుతున్నాయి. ఆ సమయంలో ఓ దుకాణదారుడు తన షాప్ తలుపు వేసేస్తున్నాడు. అయితే ఆ వడగళ్ల ధాటికి తట్టుకోలేక ఓ చిన్న పక్షి ఆ షాప్ ముందు నిల్చుంది. దానిని చూసిన షాప్ కీపర్ తలుపు తీశాడు. తలుపు తీయగానే ఆ పక్షి వేగంగా నడుచుకుంటూ లోపలికి వచ్చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 27 లక్షల మందికి పైగా వీక్షించారు. 37 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``అతను చాలా గొప్ప వ్యక్తి``, ``ఇంతకంటే అందమైన వీడియో నేను ఎప్పుడూ చూడలేదు``, ``ఆ పక్షి తరఫున ధన్యవాదాలు``, ``ఆ పక్షికి గొప్ప షెల్టర్ దొరికింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఖరీదైన కారుతో సెల్ఫీ దిగిన బుడగలమ్మే వ్యక్తి.. యజమాని వచ్చి ఏం చేశాడో చూస్తే కళ్లు చెమర్చక మానవు..!


Viral: రాఖీ పండుగకు సెలవు అడిగితే ఉన్న ఉద్యోగం ఊడింది.. కంపెనీ చెప్పిన కారణం ఏంటంటే..


Picture Puzzle: మీ మెదడుకు పదును పెట్టండి.. ఈ ఫొటోలోని ఆరు ఆంగ్ల పదాలను 15 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: రూ.వెయ్యి ఇచ్చి మరీ భార్య చేత పాలు తాగించిన భర్త.. అసలు విషయం తెలిస్తే నవ్వకుండా ఉండలేరు..!



మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 16 , 2024 | 01:30 PM