Viral: వీడ్కోలు కౌగిలింతలకు టైం లిమిట్! న్యూజిలాండ్ ఎయిర్ పోర్టు ఆదేశాలు!
ABN, Publish Date - Oct 24 , 2024 | 07:32 PM
సెండాఫ్ ఇచ్చేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చేవారు సెండాఫ్ కౌగిలింతల పేరిట ఎయిర్‌పోర్టులో ఎక్కువ సమయం ఉంటూ రద్దీకి కారణం కావద్దని న్యూజిలాండ్‌లోని డునెడిన్ విమానాశ్రయం తాజాగా సూచించింది. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: వీడ్కోలు చెప్పడం కంటే కష్టమైన పని మరొకటి లేదేమో. ముఖ్యంగా ఎయిర్ పోర్టుల్లో దృశ్యాలు చూస్తే ఎవరికైనా కచ్చితంగా ఇదే అనిపిస్తుంది. పైచదువుల కోసం విదేశాలకు వెళ్లే యువతీయువకులను చూస్తూ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అవుతారు. జీవిత భాగస్వాములకు ఎయిర్‌పోర్టుల్లో వీడ్కోలు పలికేటప్పుడు కూడా అనేక మంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటారు. వారిని కౌగిలించుకుని వదల్లేక తీవ్ర భావోద్వేగానికి లోనవుతారు. ఎయిర్‌పోర్టులోనే చాలా సేపు ఉండిపోతారు. ఈ తీరుతో ఎయిర్‌పోర్టుల్లో రద్దీ పెరిగిపోతుంటుంది. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా న్యూజిలాండ్‌లోని ఓ ఎయిర్‌పోర్టు వింత కండీషన్ పెట్టింది (Viral).
Viral: బట్టతలను జయించిన మిలియనీర్! ఈయన టెక్నిక్ ఏంటంటే..
విమానాశ్రయంలో రద్దీ తగ్గించేందుకు న్యూజిలాండ్‌లోని డునెడిన్ ఎయిర్‌పొర్టుకు కౌగిలింతలకు పరిమితి విధించింది. ప్రయాణికులతో పాటు విమానాశ్రయానికి వచ్చే బంధువులు, స్నేహితులు, జీవిత భాగస్వాములు ఎవరైనా వారికి సెండాఫ్ చెబుతూ అధిక సమయం వెచ్చించ వద్దని స్పష్టం చేసింది. మూడు నిమిషాలకు మించి ప్రయాణికులను కౌగిలించుకోవద్దని పేర్కొంది. అయిన వారి సమక్షంలో ఇంకొంత సేపు ఉండాలనుకుంటే పార్కింగ్ స్థలానికి వెళ్లాలని కూడా సూచించింది. వీడ్కోలు పలికే క్రమంలో బంధువులు, స్నేహితులు ఎక్కువ సేపు ఎయిర్‌పోర్టులో ఉండిపోవడంతో రద్దీ విపరీతంగా పెరిగి ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కరంగా మారిందని వివరించింది. ఈ మేరకు ఎయిర్‌పోర్టులో హెచ్చరిక బోర్డును కూడా అమర్చింది. అయితే, ప్రయాణికులు ఈ రూల్ ఫాలో అవుతున్నారో లేదో కనిపెట్టేందుకు భద్రతా సిబ్బందిని మాత్రం నియమించలేదు. ప్యాసెంజర్లపై నమ్మకంతో నిబంధనల అమలును వారికే వదిలిపెట్టింది.
Viral: ఇందుకేగా పిల్లల జీవితాలు నాశనమయ్యేది! తండ్రి అయ్యుండీ ఇలా చేయొచ్చా?
అయితే, ఎయిర్‌పోర్టుల్లో ఇలాంటి నిబంధన విధించడం ఇదే తొలిసారిగా కాదు. డెన్మార్క్‌లోని ఆల్బర్గ్ ఎయిర్‌పోర్టులో సెండాఫ్ ముద్దులకు మూడు నిమిషాల టైం లిమిట్ పెట్టారు. విడ్కోలు పలికేందుకు వచ్చే వారు ప్రయాణికులకు మూడు నిమిషాలకు మించి ముద్దు పెట్టి టైం వేస్ట్ చేయొద్దని, ఇతరులకు ఇబ్బంది పెట్టొద్దని నిబంధన విధించింది. దీంతో, ఈ ఉదంతం వైరల్‌గా మారింది.
Viral: ఉద్యోగులే మా సెలబ్రిటీలన్న కంపెనీ! ఎలాంటి దీపావళి గిఫ్ట్ ఇచ్చిందంటే..
Viral: బాయ్‌ఫ్రెండ్‌కు కోట్ల ఆస్తి వారసత్వంగా రానుందని తెలిసి హత్య! చివరకు..
Viral: షాకింగ్! కోడి గుడ్డు కనబడగానే ఈ పాము ఎలా రెచ్చిపోయిందో చూడండి.
Updated Date - Oct 24 , 2024 | 07:46 PM