ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: షాకింగ్ సీన్.. సడెన్‌గా భూమిలో కుంగిపోయిన కారు!

ABN, Publish Date - Aug 30 , 2024 | 01:32 PM

దక్షిణ కొరియాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రద్దీగా ఉన్న రహదారి అకస్మాత్తుగా కుంగిపోయి పెద్ద గొయ్యి ఏర్పడటంతో ఓ కారు కుంగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ కొరియాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రద్దీగా ఉన్న రహదారి అకస్మాత్తుగా కుంగిపోయి పెద్ద గొయ్యి ఏర్పడటంతో ఓ కారు అందులో పడిపోయింది. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

సియోల్‌ నగరంలో ఈ ఘటన వెలుగు చూసింది. సాంగ్‌సాన్ బ్రిడ్జి వైపు వెళుతున్న కారు అకస్మాత్తుగా గొయ్యిలో పడిపోయింది. ఘటన సమయంలో కారులో 82 ఏళ్ల డ్రైవర్, 76 ఏళ్ల ప్యాసెంజర్ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇరువురికీ గాయాలు కాగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన అత్యవసర సిబ్బంది క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు (Sinkhole Swallows Car In Korea Causes Major Traffic Chaos) .

Viral: కారులో డాష్‌క్యామ్ పెట్టుకోండి.. ఇలాంటి మహిళ ఎదురైతే యమా డేంజర్


కాగా, గత కొన్నేళ్లల్లో సియోల్‌లో ఇలాంటి పలు ఘటనలు సంభవించడం స్థానికంగా కలకలానికి దారి తీసింది. అక్కడి మౌలిక వసతుల శాఖ లెక్కల ప్రకారం, 2019 నుంచి 2023 మధ్య మొత్తం 879 ప్రాంతాల్లో రోడ్లు అకస్మాత్తుగా కుంగిపోయి గొయ్యి ఏర్పడిన ఘటనలు వెలుగు చూశాయి.

ఇక తాజా ఘటన తాలూకు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దాదాపు రెండున్న మీటర్ల లోతున్న గొయ్యిలో పడి ఉన్న కారు చూసి జనాలు షాకైపోతున్నారు. నగరం నడిబొడ్డున ఇలా జరగడం పలువురిని ఆందోళనకు గురి చేసింది. ఇలా ఎందుకు జరుగుతోందో అధికారుల్లోనే స్పష్టత లోపించింది. రోడ్డు కింది మురుగునీటి పైపులైన్లు ధ్వంసం కావడం వల్ల ఇలా జరిగుండొచ్చని కొందరు భావించినా ప్రభుత్వ అధ్యయనంలో మాత్రం ఈ భావన తప్పని తేలింది. నిర్మాణరంగ కార్యకలాపాల వల్ల ఇలా జరిగుండొచ్చని కూడా కొందరు భావిస్తున్నారు.


రోడ్డు మీద అకస్మాత్తుగా ఏర్పడిన గొయ్యి కారణంగా గత వారం మలేషియాలో ఓ భారతీయ మహిళ దుర్మరణం చెందారు. ఒక్కసారిగా రోడ్డు కుంగడంతో 8 అడుగుల లోతున్న గొయ్యిలోకి మహిళ జారిపోయింది. మహిళ కోసం అత్యవసర సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా ఉపయోగం లేకపోయింది. గతేడాది ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే మళ్లీ రోడ్డు కుంగి ఓ మహిళ బలికావడంతో స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

Read Latest and Viral News

Updated Date - Aug 30 , 2024 | 01:40 PM

Advertising
Advertising