ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: నిధి కోసం వెతుకుండగా బయటపడిన బంగారు ఉంగరాలు.. వాటి కింద ఏముందో అని చూడగా.. షాకింగ్ సీన్..

ABN, Publish Date - Feb 21 , 2024 | 08:48 PM

గుప్త నిధుల కోసం ఎంతో మంది తవ్వకాలు జరపడం చూస్తుంటాం. మరోవైపు కొందరికి అనుకోకుండా బంగారు నాణేలు దొరకుతుంటాయి. ఇంకొదరికి పురాతన నిర్మాణాలను కూల్చే సమయంలోనూ ...

గుప్త నిధుల కోసం ఎంతో మంది తవ్వకాలు జరపడం చూస్తుంటాం. మరోవైపు కొందరికి అనుకోకుండా బంగారు నాణేలు దొరకుతుంటాయి. ఇంకొదరికి పురాతన నిర్మాణాలను కూల్చే సమయంలోనూ బంగారు, వెండి వస్తువులు దొరకడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి గుప్త నిధుల కోసం మట్టిలో వెతుకుతుండగా.. బంగారు ఉంగరాలు కనిపించాయి. వాటి కింద ఏముందో అని చూడగా... చివరకు షాకింగ్ దృశ్యం కనిపించింది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మట్టిలో నిధి కోసం వెతుకుతుంటాడు. కొంత మట్టి తవ్వగానే అతడికి ఓ నీలి రంగు ఉంగరం కనిపిస్తుంది. అంతలోనే ఆ పక్కనే మరో తెల్ల రాయి ఉంగరంతో పాటూ (Gold rings found in soil) రెండు బంగారు ఉంగరాలు కూడా కనిపిస్తాయి. దీంతో ఎంతో సంతోషంతో వాటిని తీసుకునేందుకు ప్రయత్నించగా ఏదో తగులుతున్నట్లు అనిపిస్తుంది. దీంతో ఉంగరాలపై నీళ్లు పోసి చూడగా.. కింద ఓ అస్తిపంజరం (skeleton) కనిపిస్తుంది. పూర్తిగా కుళ్లిపోయి ఎముకలుగా మారిన చేతి వేళ్లకు ఉంగరాలు మాత్రం అలాగే ఉండడం చూసి షాక్ అవుతారు.

Viral Video: అరెరే..! అనవసరంగా భార్యతో పెట్టుకున్నాడే.. చివరకు ఈ భర్త పరిస్థితి ఏమైందో చూస్తే..

చివరకు అస్తిపంజరాన్ని మొత్తం శుభ్రం చేసి, నాలుగు ఉంగరాలు బయటకు తీసి.. తన వేలికి పెట్టుకుని చూసుకుంటాడు. మట్టిలో కూరుకుపోయినా అవి మాత్రం ఏమాత్రం పాడుకాకుండా అలాగే ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్!.. చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటే.. ఇదంతా కావాలని చేసినట్లుంది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇదంతా వ్యూస్ కోసమే చేశారు.. అంతా ఫేక్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం 1.90లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ వరుడేంటీ.. మరీ విచిత్రంగా ఉన్నాడు.. వధువు ప్రేమగా దగ్గరికొస్తే.. చివరికి ఇతను చేసిన పని ..

Updated Date - Feb 21 , 2024 | 08:48 PM

Advertising
Advertising