Viral: వామ్మో.. తనను కరిచిన పామును తిరిగి కరిచాడు.. తర్వాతేం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
ABN, Publish Date - Jul 06 , 2024 | 12:01 PM
ఆ వ్యక్తి రైల్వే గ్యాంగ్ మెన్.. రైలు పట్టాలను రిపేర్ చేస్తూ ఉంటాడు.. ఇటీవల అతడు తన పని పూర్తి చేసుకుని రైల్వే బేస్ క్యాంప్‌లో నిద్రపోతున్నాడు.. ఆ సమయంలో ఓ విషపూరిత సర్పం అక్కడకు వచ్చి కాటేసింది.. ఆ తర్వాత కోపం పట్టలేకపోయిన ఆ వ్యక్తి పామును పట్టుకుని రెండు సార్లు కొరికేశాడు.
ఆ వ్యక్తి రైల్వే గ్యాంగ్ మెన్.. రైలు పట్టాలను రిపేర్ చేస్తూ ఉంటాడు.. ఇటీవల అతడు తన పని పూర్తి చేసుకుని రైల్వే బేస్ క్యాంప్‌లో నిద్రపోతున్నాడు.. ఆ సమయంలో ఓ విషపూరిత సర్పం (Snake) అక్కడకు వచ్చి కాటేసింది (Snake bite).. ఆ తర్వాత కోపం పట్టలేకపోయిన ఆ వ్యక్తి పామును పట్టుకుని రెండు సార్లు కొరికేశాడు (Man bites snake).. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు.. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral News)గా మారింది. ఈ ఘటన బీహార్ (Bihar)లో జరిగింది.
బీహార్‌లోని నవాడాకు చెందిన సంతోష్ లోహర్ అనే వ్యక్తి రైల్వే లైన్ వేసే పని చేస్తుంటాడు. పని తర్వాత తన బేస్ క్యాంపులో నిద్రిస్తుండగా ఓ పాము అతడిని కాటేసింది. అయితే కాటేసిన పామును రెండు సార్లు కొరికితే విషం విరిగిపోతుందనే మూఢ నమ్మకం కారణంగా సంతోష్ ఆ పామును పట్టుకుని రెండు సార్లు కొరికాడు. సంతోష్ అలా చేయడం వల్ల పాము చనిపోయింది. అలాగే సంతోష్ కూడా ప్రమాదంలో పడ్డాడు. విషం అతడి ఒళ్లంతా పాకింది.
పక్కనే ఉన్న రైల్వే సిబ్బంది వెంటనే సంతోష్‌ను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో సంతోష్ కోలుకున్నాడు. ఒకరోజు చికిత్స తర్వాత కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే కాటేసిన పామును తిరిగి కొరకడం చాలా ప్రమాదం అని, ఆ క్రమంలో పాము మరోసారి కాటేసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాము కాటుకు గురైన వ్యక్తిని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లడమే మేలైన మార్గమని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Puzzle: మీరు లాజికల్‌గా ఆలోచించగలరా? అయితే ఈ ఫొటోలో ఉన్న తప్పును 10 సెకెన్లలో కనిపెట్టండి!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 06 , 2024 | 12:04 PM