ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: విమానంలో లగేజీ పెడుతున్న సమయంలో ప్రయాణికులకు షాకింగ్ సీన్.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ABN, Publish Date - Jan 19 , 2024 | 03:11 PM

కొన్నిసార్లు ఊహించని ప్రదేశాల్లో ఊహించని వస్తువులు, వింత వింత జీవులు దర్శనమిస్తుంటాయి. మరికొన్నిసార్లు కలలో కూడా ఊహించని ఘటనలు నిజ జీవితంలో జరగడం చూస్తుంటాం. ఇలాంటి...

కొన్నిసార్లు ఊహించని ప్రదేశాల్లో ఊహించని వస్తువులు, వింత వింత జీవులు దర్శనమిస్తుంటాయి. మరికొన్నిసార్లు కలలో కూడా ఊహించని ఘటనలు నిజ జీవితంలో జరగడం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. విమానంలో లగేజీ సర్దుకుంటున్న ప్రయాణికులకు షాకింగ్ సీన్ కనిపించింది. దీంతో ఒక్కసారిగా అంతా భయాందోళనకు గురయ్యారు. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) వైరల్ అవుతోంది. బ్యాంకాక్ నుంచి ఫుకెట్‌కు ప్రయాణిస్తున్న థాయ్ ఎయిర్‌ఏషియా విమానంలో (Thai AirAsia flight) ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో నిండిన విమానం బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రయాణికులంతా ఎవరి లగేజీని వారు సర్దుకుంటూ హడావుడిగా ఉన్నారు. ఇంతలో అక్కడ ఊహించని ఘటన చోటు చేసుకుంది. లగేజీని ర్యాక్‌లో పెడుతుండగా పైన ఓ పాము (snake) సడన్‌గా బయటికి వచ్చింది. దాన్ని చూడగానే వారంతా భయంతో కేకలు వేశారు. విమానంలోకి పాము రావడం ఏంటీ.. అని అనుకుంటూ మరికొంతమంది ఆసక్తిగా తిలకించారు.

Viral: విమానంలో విచిత్ర ఘటన.. సీట్లో కూర్చోకుండా నేరుగా క్యాబిన్ డోర్ తెరిచిన ప్రయాణికుడు.. చివరకు..

విమానం లోపల పైభాగంలో కనిపించిన పాము.. అటూ ఇటూ తిరుగుతూ అందరికీ షాక్ ఇచ్చింది. దాన్ని బయటకు పంపాలని సిబ్బందితో పాటూ ప్రయాణికులూ వివిధ రకాలుగా ప్రయత్నించారు. ఓ వ్యక్తి పామును వాటర్ బాటిల్‌లో బంధించాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు మరో వ్యక్తి ఓ ప్లాస్టిక్ కవర్ పట్టుకొచ్చి, పామును జాగ్రత్తగా అందులో వేసేశారు. దీంతో ప్రయాణికులంతా హమ్మయ్య..! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘విమానంలోకి పాము ఎలా వచ్చిందబ్బా’’.. అంటూ కొందరు, ‘‘ఈ పాముకు ఫ్లైట్ జర్నీ అంటే బాగా ఇష్టమేమో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 51వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: చికెన్ షావర్మా తినబోయి ఖంగుతిన్న వ్యక్తి.. స్విగ్గీకి ఫిర్యాదు చేయగా.. ఎలాంటి రిజల్ట్ వచ్చిందంటే..

Updated Date - Jan 19 , 2024 | 03:11 PM

Advertising
Advertising