ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి.. మహిళ మంచు తొలగిస్తుండగా.. మధ్యలో..

ABN, Publish Date - Feb 11 , 2024 | 06:08 PM

కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటే.. చివరికి ఇంకొకటి జరుగుతుంటుంది. ఏదో చేయాలని చూస్తే.. చివరికి ఇంకేదో జరుగుతుంటుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పుడప్పుడూ ప్రకృతి మనకు ఎదరుతిరుగుతుంటుంది. ఈ క్రమంలో..

కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటే.. చివరికి ఇంకొకటి జరుగుతుంటుంది. ఏదో చేయాలని చూస్తే.. చివరికి ఇంకేదో జరుగుతుంటుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పుడప్పుడూ ప్రకృతి మనకు ఎదరుతిరుగుతుంటుంది. ఈ క్రమంలో కొన్ని సార్లు ఊహించని ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి అనూహ్య ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ మంచు తొలగిస్తుండగా.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన ఇంటి బయట పేరుకుపోయిన మంచును తొలగించేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఎంతో కష్టపడి ఓ వైపు నుంచి పేరుకుపోయిన మంచును తొలగిస్తుంటుంది. ఇలా సగం తొలగించగానే ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. పైనుంచి మంచు పలకలు (Snow falling on woman) ధబేల్‌మని మీద పడిపోతాయి. దీంతో ఆమె ఒక్కసారిగా బోర్లా పడిపోతుంది. పూర్తిగా మంచుకలో కూరుకుపోతుంది.

Optical illusion puzzle: గుర్రంపై ఉన్న రాజుకు దొరక్కుండా.. ముగ్గురు దొంగలు దాక్కుని ఉన్నారు.. కనుక్కోండి చూద్దాం..

అదే సమయంలో అక్కడున్న వారు గమనించి పరుగు పరుగున అక్కడికి వస్తారు. మంచులో పడిపోయిన ఆమెను రక్షించి, ఇంట్లోకి తీసుకెళ్తారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ప్రకృతికి కోపం వస్తే ఇలాగే ఉంటుందేమో’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో పాపం! ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 21మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Optical illusion: ఈ చిత్రంలో మరో గుర్రం కూడా దాక్కుని ఉంది.. దాన్ని కనిపెట్టడం మీవల్ల అవుతుందేమో ట్రై చేయండి..

Updated Date - Feb 11 , 2024 | 06:08 PM

Advertising
Advertising