ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Naga Chaitanya-Sobitha: కాంజివరం చీరలో శోభిత.. జరీ పంచెలో చైతన్య.. పెళ్లిలో అసలు హైలెట్ ఇదే

ABN, Publish Date - Dec 05 , 2024 | 11:20 AM

టాలీవుడ్ కొత్త జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అచ్చమైన తెలుగు సంప్రదాయంలో జరిగిన పెళ్లి తంతులో వధూవరుల కాస్ట్యూమ్స్ చర్చనీయాంశమయ్యాయి. శోభిత ఎంతో నేర్పుగా తన స్పెషల్ డే కోసం చేసుకున్న ఎంపికలు ఆమెను బ్యూటిఫుల్ బ్రైడ్ గా మార్చేశాయి.

Naga Chaitanya-Sobitha

అక్కినేని నాగచైతన్య- శోభితా ధూలిపాళ్ల పెళ్లి వేడుక కన్నుల పండువగా జరిగింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. బంగారు అంచు కాంచీవరం చీరలో శోభిత అచ్చ తెలుగు పెళ్లి కూతురిలా మెరిసిపోయింది. తన పెళ్లి రోజు లుక్ తో అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఎలాంటి డిజైనర్ సాయం లేకుండానే ఆమె తన దుస్తులను తల్లితో కలిసి నేరుగా ఖరీదు చేసినట్టు తెలుస్తోంది. సిల్వర్ రంగు చీర.. బంగారు జరీలో అచ్చం దేవకన్యలా కనిపించింది. ఆసాంతం తెలుగు దనం ఉట్టిపడేలా సంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ ఆమె తన కాస్ట్యూమ్‌ను ఎంచుకున్న తీరు పలువురిని ఆకట్టుకుంది.


అన్నింట్లోనూ తెలుగుదనమే..

డిజైనర్ నగలకు బదులుగా ఆమె తన పెళ్లి రోజు కోసం తన తల్లి, అమ్మమ్మ ధరించిన ఆభరణాలనే వేసుకోవడం విశేషం. ఆమె తమ వంశపారంపర్యంగా వస్తున్న ముక్కు పుడకను ధరించి పెళ్లి పీటలపై కూర్చోవడం ఈ వేడుకలో మరో హైలెట్ గా నిలిచింది. ఇక మేకప్ విషయంలోనూ శోభిత తన ప్రత్యేకతను తెలిపింది. మినిమల్ బ్రోంజ్ లుక్ తో బేస్‌ను క్రియేట్ చేసి కళ్లను తీర్చిదిద్దేందుకు బంగారు వర్ణం రంగును ఎంచుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన బోల్డ్ కాజల్ లుక్ తో పాటు మెరుపులు లేని మ్యాటీ లిప్ స్టిక్ షేడ్ తో పెదాలను హైలెట్ చేశారు. ఇక హెయిర్ స్టైల్ విషయంలో స్లీకీ బన్‌ను వేసుకుని దానిని బంగారు ఆభరణాలతో అలంకరించారు. పెళ్లి తిలకం దగ్గరి నుంచి పూలజడ వరకు మొత్తం అచ్చం తెలుగు పెళ్లి కూతిరిలా కనిపించిన శోభిత తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలపై తనకున్న మక్కువను చాటుకుంది.


శోభితను మ్యాచ్ చేస్తూ.. చైతు

ఇక చైతూ సైతం ఎర్ర రంగు జరీతో ఉన్న పట్టు పంచెలో మెరిసిపోయాడు. నిండైన హెయిర్ స్టైల్‌తో నుదుట బాసింగంతో నాగచైతన్య అందరి అటెన్షన్ ను గ్రాబ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను హీరో నాగార్జున సోషల్ మీడియాలో పంచుకున్నారు. కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


Updated Date - Dec 05 , 2024 | 12:11 PM