ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఇదేంటి తల్లీ.. నువ్వే ఇలా ఉంటే ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటో? నెట్టింట టీచర్ వీడియో వైరల్!

ABN, Publish Date - Mar 17 , 2024 | 07:23 PM

స్కూల్‌లో విద్యార్థుల ముందు టీచర్ డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: స్కూల్‌లో విద్యార్థుల ముందు టీచర్ డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా (ViralVideo) మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆ టీచర్‌కు మద్దతుగా నిలుస్తుంటే మరికొందరు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో, మరోసారి ఉపాధ్యాయుల ప్రవర్తనా నియమావళిపై చర్చ మొదలైంది.

Viral: భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని పెళ్లైన 6 ఏళ్లకు తెలిసి..

ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందీ క్లారిటీ లేకపోయినప్పటికీ ఓ టీచర్ పుట్టిన రోజు సందర్భంగా తీసినట్టు మాత్రం స్పష్టమవుతోందని నెటిజన్లు చెబుతున్నారు. ఇందులోని టీచర్ బంటీ అండ్ బబ్లీ బాలీవుడ్ సినిమాలోని ఓ ఐటమ్ సాంగ్‌కు నృత్యం చేసింది. చుట్టూ ఉన్న విద్యార్థులు ఆమెను ప్రోత్సహిస్తుండగా ఎంతో సంతోషంగా ఆమె డ్యాన్స్ చేసింది. ఆమె డ్యాన్స్ చేసిన క్లాస్ రూం బోర్డుపై హ్యాపీ బర్త్‌ డే అని రాసుంది. దీంతో, క్లాస్‌రూంలో పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఈ వీడియో తీసినట్టు జనాలు భావిస్తున్నారు.

Viral: ట్రాఫిక్‌లో యువతిని అదేపనిగా ఫాలో అయిన ఆటోవాలా.. ఆమె స్కూటీ ఆగిపోగానే ఊహించని విధంగా..


అయితే, జనాలు ఈ వీడియోపై రకరకాలుగా స్పందించారు. కొందరు ఆమెపై విమర్శలు మొదలెట్టారు. ఇలాంటి రోజు కూడా ఒకటి వస్తుందని తాను భావించలేదంటూ ఓ నెటిజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీచర్లే ఇలా అయితే ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటని మరొకరు మండిపడ్డారు.

Viral: దోశ ఆర్డరిచ్చిన మహిళకు భారీ షాక్.. రెండు ముక్కలు తిన్నాక డౌటొచ్చి కిందకు చూస్తే..

ఇలా విమర్శల జడి పెద్దదవుతుండటంతో కొందరు నెటిజన్లు టీచర్‌కు మద్దతుగా నిలిచారు. ఎదుటి వాళ్లు సంతోషంగా ఉంటే కొందరికి కంటగింపుగా మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్ అయినంత మాత్రాన సంతోషం వచ్చినప్పుడు డ్యాన్స్ చేయకూడదా? ఆమె డ్యాన్స్‌లో అసభ్యత ఎక్కడుంది? స్త్రీలు ఏం చేసినా తప్పుబట్టడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ మరొకరు మండిపడ్డారు. ఇలా ఈ అంశం చర్చనీయాంశం కావడంతో వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో కనసాగుతోంది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2024 | 01:30 PM

Advertising
Advertising