Viral: 8 నెలల శిశువును ఆన్‌లైన్‌లో అమ్మిన తల్లి! తప్పు తెలుసుకుని ఇప్పుడేమో..
ABN, Publish Date - Nov 19 , 2024 | 09:54 PM
డబ్బుల కోసం తన 8 నెలల కుమారుడిని ఆన్‌లైన్‌లో విక్రయించిన ఓ తల్లి ఇప్పుడు తన బిడ్డ తనకు కావాలంటూ మొరపెట్టుకోవడం దక్షిణాఫ్రికాలో సంచలనంగా మారింది. చేసిన తప్పు తెలిసొచ్చిందని ఆమె ఎంత ప్రాధేయపడుతున్నా జనాలు మాత్రం ఆమెపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: డబ్బుల కోసం తన 8 నెలల కుమారుడిని ఆన్‌లైన్‌లో విక్రయించిన ఓ తల్లి ఇప్పుడు తన బిడ్డ తనకు కావాలంటూ మొరపెట్టుకోవడం దక్షిణాఫ్రికాలో సంచలనంగా మారింది. చేసిన తప్పు తెలిసొచ్చిందని ఆమె ఎంత ప్రాధేయపడుతున్నా జనాలు మాత్రం ఆమెపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. మహిళపై మానవ అక్రమరవాణా నేరానికి సంబంధించిన కేసు నమోదయ్యే అవకాశం ఉండటంతో పరిస్థితి మరింత సంక్లిష్ఠంగా మారింది (Viral).
Viral: వావ్.. టాటాల రూ.7 వేల కోట్ల ఆఫర్‌ను కాదన్న ఈమె ఎవరో తెలిస్తే..
స్థానిక మీడియా కథనాల ప్రకారం, సదరు మహిళ అక్టోబర్‌లో తన బిడ్డను ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టింది. తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆమె బిడ్డను అమ్మాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో ఓ మహిళ ఫేస్‌బుక్ ద్వారా ఆమెను సంప్రదించింది. ఆ తరువాత ఇద్దరూ ప్రిటోరియాలోని ఓ కాఫీ షాపులో కలుసుకుని ఓ అంగీకారానికి వచ్చారు. అప్పటికే బిడ్డను తన వెంటనే తీసుకొచ్చిన ఆమె చిన్నారిని ఆ మహిళకు అప్పగించి డబ్బు తీసుకుంది. తరువాత ఆ వ్యక్తి చిన్నారితో కలిసి ట్యాక్సీలో వెళ్లిపోయింది.
Viral: దేవత అంటే ఈమెనే! లాటరీలో గెలిచిన రూ.121 కోట్లతో..
బిడ్డ దూరమయ్యాక నెల రోజులకు మళ్లీ నెట్టింట బిడ్డ కావాలంటూ అభ్యర్థనలు మొదలెట్టింది. తనకు తప్పు తెలిసొచ్చిందని, బిడ్డ దూరం కావడం తాను తట్టుకోలేకపోతున్నానని చెప్పింది. ఆ బిడ్డను తనకు తిరిగి ఇవ్వాలంటూ సదరు మహిళను అభ్యర్థించింది. ‘‘డబ్బులు లేక బిడ్డను ఎలా పెంచాలో తెలీక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా చర్యలకు ఇప్పుడు చింతిస్తున్నాను. నా బిడ్డ నాకు కావాలి. అతడంటే నాకెంతో ఇష్టం’’ అని వాపోయింది.
Banana Phobia: మహిళా మంత్రికి వింత భయం! అధికారిక కార్యక్రమాల్లో అరటి పళ్లపై నిషేధం!
కాగా, ఈ ఉదంతం వైరల్ కావడంతో పోలీసులు ఆమెను అక్టోబర్ 19న అరెస్టు చేశారు. చిన్నారి తల్లి తన కాళ్లమీద తాను నిలబడే వరకూ నెలకు కొంత మొత్తం ఇస్తానని బిడ్డను కొనుక్కున్న మహిళ చెప్పిందని తెలిపారు. అయితే, కొన్ని రోజులకే ఆమె మాట తప్పి శిశువు తల్లికి డబ్బులు చెల్లించడం మానేసిందని అన్నారు. మరోవైపు, బిడ్డను కొనుక్కున్న మహిళ జోహానెస్‌బర్గ్‌లో ఉంటున్నట్టు నిందితురాలు చెప్పింది. ఆమెను వెతికే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే, శిశువు తల్లి బెయిల్ పై విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ కేసు మరోసారి విచారణకు రానుంది. ఇక బిడ్డ తండ్రి కూడా కోర్టును ఆశ్రయించాడు. తాము వేర్వేరుగా ఉంటున్నామని, తనకు తెలీకుండా నిందితురాలు ఇదంతా చేసిందని చెప్పుకొచ్చాడు.
Viral: ఒకటో తరగతి ఫీజు రూ.4.27 లక్షలు.. బాలిక తండ్రి గగ్గోలు
Updated Date - Nov 19 , 2024 | 10:01 PM