ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఖడ్గమృగాల్ని నడిచే అణుబాంబుల్లా మారుస్తున్న శాస్త్రవేత్తలు! ఎందుకో తెలిస్తే..

ABN, Publish Date - Jul 01 , 2024 | 09:06 PM

ఖడ్గమృగాల వేటకు అడ్డుకట్ట వేసేందుకు శాస్త్రవేత్తలు వాటి కొమ్ములకు అణుధార్మిక ఇంజెక్షన్లు ఇస్తున్నారు. తద్వారా వాటి కొమ్ములను మానవులకు నిరుపయోగంగా మారిపోతాయని చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతి వనరులను యథేచ్ఛగా వాడుతున్న మానవుడు మూగజీవాలకు మాత్రం నరకం చూపిస్తున్నాడు. ముఖ్యంగా, ప్రకృతి సమతౌల్యానికి, జీవవైవిధ్యానికి కారణమైన ఏనుగు, ఖడ్గమృగం లాంటి జంతువులను ఇష్టారీతిన వేటాడుతూ అవి అంతరించిపోయేలా చేస్తున్నారు. దీనిని అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఓ కొత్త ఐడియా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ (Viral) అవుతోంది. సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

Viral: భారత ఆర్మీ అంటే ఇదీ! ఈ 56 ఏళ్ల మేజర్ జనరల్ స్టామినా చూస్తే..


జాహాన్నెస్‌బర్గ్ లోని విట్స్ యూనివర్సిటీలో గల రేడియేషన్ అండ్ హెల్త్ ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ శాఖాధిపతి జేమ్స్ లార్కిన్ ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖడ్గమృగం కొమ్ముల్లో ప్రాణహాని లేని రేడియోధార్మిక అణువులు ఉన్న ఇంజెక్షన్లు ఇస్తారు. దీంతో, ఇవి మనుషులకు నిరుపయోగంగా మారతాయి. అంతేకాకుండా, రెడియో ధార్మికత కారణంగా వీటిని ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాల ద్వారా స్మగుల్ చేసేందుకు ప్రయత్నిస్తే అలారం మోగి సెక్యూరిటీని అప్రమత్తం చేస్తాయి. ఈ ఇంజెక్షన్లతో ఖడ్గమృగాల వేట కొంతైనా అడ్డుకట్ట పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ జంతువులు వేటగాళ్ల పాలిట నడిచే అణుబాంబుల్లా మారిపోయాయని వ్యాఖ్యానిస్తున్నారు.

కొమ్ముల కోసం ఖడ్గమృగాల్ని విపరీతంగా వేటాడుతున్నారని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికాలో ప్రతి 20 గంటలకో ఖడ్గమృగాన్ని పొట్టనపెట్టుకుంటున్నారని చెప్పారు. గతేడాది మొత్తం 500 జీవాలు వేటగాళ్లకు బలయ్యాయని అన్నారు. ఈ ప్రయోగాన్ని ఆశించిన ఫలితం ఇచ్చే అవకాశాలు మెండుగా ఉండటంతో ఏనుగులు, అలుగుల సంరక్షణకూ ఈ టెక్నిక్‌ను విస్తరించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Read Viral and Telugu News

Updated Date - Jul 01 , 2024 | 09:06 PM

Advertising
Advertising