ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: దేవుడా.. రైల్వే స్టేషన్‌లో ఊహించని సీన్! ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో!

ABN, Publish Date - Jun 16 , 2024 | 07:42 PM

రైల్వే స్టేషన్‌లో మంచినీటి నల్లా పాడవడంతో ప్రయాణికులు నీటిలో తడిసిపోవడం ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: రైల్వే స్టేషన్ల పరిస్థితిని మెరుగు పరిచేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా ఆశించిన స్థాయిలో మాత్రం మార్పులు రావట్లేదని చెప్పాలి. ఇది చాలదన్నట్టు.. స్టేషన్లో అప్పుడప్పుడూ తలెత్తే అసాధారణ ఇబ్బందులు ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతుంటాయి. ఇలాంటి ఓ షాకింగ్ దృశ్యం ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.

Viral: ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చిన ఐస్‌క్రీమ్‌లో జెర్రె.. మహిళకు షాక్!

ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ ఓ రైల్వే స్టేషన్‌లో మంచి నీటి కుళాయి పాడై నీరు ఎగజిమ్మింది. ఎంతలా అంటే, నీటి ధార ఏకంగా ఓ ప్లాట్‌ఫాం దాటి అవతలివైపు దూసుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు నీటిలో తడవకుండా పక్కకు తప్పుకున్నారు. మరికొందరు ఈ వింత దృశ్యాన్ని కెమెరాలో బంధించారు. అయితే, అదే ప్లాట్‌ఫాంపై రైలు రావడంతో అందులోని ప్రయాణికులపై నీరు పడి మొత్తం తడిసిపోయారు. రైలు అప్పటికి ఇంకా ఆగకపోవడంతో ఏం చేయలేక నీటిలో తడిశారు (Special arrangements at platform by Railways for train passengers leaves netizens amused).


వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు పడీ పడీ నవ్వుకుంటున్నారు. ఎండాకాలంలో ప్రయాణికుల సౌకర్యార్థం చేసిన కొత్త ఏర్పాటు ఇదేనంటూ కొందరు సెటైర్లు పేల్చారు. వందేభారత్ వంటి అత్యాధునిక రైళ్లు ప్రవేశపెడుతున్నా స్టేషన్ల స్థితిగతులు మాత్రం మారట్లేదని అన్నారు. ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అని మరి కొందరు విచారం వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది. మరి మీరూ దీనిపై ఓ లుక్కేయండి.

Read Viral and Telugu News

Updated Date - Jun 16 , 2024 | 07:47 PM

Advertising
Advertising