ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: చిరుతకు చుక్కలు చూపించిన ఉడత! దీని స్కెచ్ మామూలుగా లేదుగా!

ABN, Publish Date - Sep 23 , 2024 | 05:30 PM

పెద్ద పెద్ద జంతువులను కూడా అలవోకగా వేటాడే చిరుతకు ఓ ఉడత చుక్కలు చూపించింది. చెట్టుపైకి ఎక్కుతూ దిగుతూ ఉడత చిరుతకు దొరక్కుండా చెమటలు పట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: పెద్ద పెద్ద జంతువులను కూడా అలవోకగా వేటాడే చిరుతకు ఓ ఉడత చుక్కలు చూపించింది. చెట్టుపైకి ఎక్కుతూ దిగుతూ చిరుతకు దొరక్కుండా చెమటలు పట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతోంది. ఉడత వ్యూహం చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. దీని తెలివి అసామాన్యం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Viral: దంపతుల ఏళ్ల నాటి కల.. 17 కోట్లు పెట్టి భారీ ఎస్టేట్ కొంటే..

దక్షిణాఫ్రికాలోని మాలామాలా ప్రైవేట్ గేమ్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఈ అద్భుత దృశ్యం కనిపించింది. సాధారణంగా పెద్ద జంతువులను వేటాడే చిరుత దృష్టి ఓ ఉడతపై పడింది. ఆ రోజు దానికి మరే జంతువు దొరకలేదేమో కానీ ఉడతను పట్టుకునేందుకు చిరుత గట్టి ప్రయత్నమే చేసింది. కానీ ఉడత తెలివి, వేగం ముందు చిరుత వెలవెల పోయింది (squirrel outsmarted a leopard in this video from Africa).

Viral: 18 ఏళ్లుగా పక్కింటి వ్యక్తి కరెంటు బిల్లు చెల్లిస్తున్నట్టు తెలిసి షాక్!


తొలుత చిరుత ఉడతను గమనించగానే చెట్టుపైకి ఎక్కింది. దాని రాకను చూసిన ఉడత తన వ్యూహాన్ని అమలు చేసింది. చిరుతకు చిక్కకుండా కొమ్మ చుట్టూ తిరుగుతూ కిందకు దిగిపోయింది. అది కిందకు రాగానే ఉడత మళ్లీ పైకెక్కింది. చిరుతకు చిక్కకుండా కొమ్మల మధ్య అటూ ఇటూ పరిగెడుతూ దాగుడు మూతలు ఆడింది. దాన్ని ఊరించి, దగ్గరుకు రానిచ్చి క్షణాల్లో తప్పించుకుని పారిపోయింది. ఉడత ఎప్పటికైనా చిక్కుతుందనే ఆశతో చిరుత మాత్రం దాని వెంట పడుతూనే ఉంది కానీ దాన్ని పట్టుకోలేకపోయింది.

Civil Aviation: విమానాలు గరిష్ఠంగా ఎంత ఎత్తులో ప్రయాణించగలవో తెలుసా?

అలా కాసేపు చిరుతతో ఫుట్‌బాల్ ఆడుకున్న ఉడత.. చిరుత చిటారుకొమ్మన ఉన్నప్పుడు కిందకు దూకి పొదల్లోకి పారిపోయింది. అయితే, ఆశ చావని చిరుత మళ్లీ కిందకు దూకి దాని వెనక పరిగెత్తినా ఉపయోగం లేకపోయింది.


వీడియోలో ఇదంతా చూసిన జనాలు పడీపడీ నవ్వుకున్నారు. టామ్ అండ్ జెర్రీ షో చూసినట్టు ఉందని కామెంట్ చేశారు. ఉడత చిరుతను పరిగెత్తించిన వైనం అద్భుతంగా ఉందని, దాని ధైర్యానికి, వ్యూహానికి హాట్సాఫ్ చెప్పాల్సిందేనని అంటున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్ అవుతోంది.

Legal Awareness: భారతీయ మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన టాప్ 5 చట్టాలు!

Viral: ఢిల్లీలో పర్యటిస్తూ భారత్‌పై బ్రిటీషర్ అవాకులు చవాకులు! వీడియో వైరల్

Read Latest and Viral News

Updated Date - Sep 23 , 2024 | 05:37 PM