ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: తండ్రి ప్రేమ అంటే ఇదీ! నెట్టింట వైరల్ అవుతున్న డెలివరీ ఏజెంట్ ఉదంతం

ABN, Publish Date - Sep 05 , 2024 | 01:20 PM

తండ్రి ప్రేమకు అసలైన నిదర్శనంగా నిలుస్తున్న ఓ జొమాటో డెలివరీ ఏజెంట్ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కూతురి కోసం అతడు పడుతున్న కష్టం జనాల హృదయాలను కదిలిస్తోంది. దీంతో, అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: తండ్రి ప్రేమకు అసలైన నిదర్శనంగా నిలుస్తున్న ఓ జొమాటో డెలివరీ ఏజెంట్ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది. కూతురి కోసం అతడు పడుతున్న కష్టం జనాల హృదయాలను కదిలిస్తోంది. దీంతో, అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఢిల్లీలోని ఖాన్‌మార్కెట్‌ వద్ద ఉన్న స్టార్‌బక్స్ వద్ద ఈ ఉదంతం వెలుగు చూసింది. ఓ ఆర్డర్‌ను పికప్ చేసుకునేందుకు తన 2 ఏళ్ల కూతురిని వెంట తీసుకుని ఓ డెలివరీ ఏజెంట్ వచ్చాడు. అతడిని చూడగానే స్టోర్ మేనేజర్ ఆశ్చర్యపోయాడు.

Viral: ఇతడు పైలట్టేనా? లారీ క్లీనరా? విమానం కిటికీలోంచి బయటకొచ్చి..


‘‘ఈ రోజు ఓ డెలివరీ ఏజెంట్ మా స్టోర్‌‌కు వచ్చాడు. వ్యక్తిగత జీవితంలో పలు సవాళ్లను ఎదుర్కొంటున్నా అతడు కూతురి కోసం కష్టపడుతున్న తీరు మమ్మల్ని కదిలించింది. చిన్నారిని వెంట తీసుకునే అతడు పనిలోకి వచ్చాడు. కూతురి పట్ల అతడికున్న ప్రేమ, పని పట్ల నిబద్ధత గొప్పది’’ అని స్టోర్ మేనేజర్ లింక్డ్ఇన్‌లో రాసుకొచ్చారు.

తన కూతురి పట్ల జాగ్రత్త వహిస్తూ సోనూ తన పని తాను చేసుకుపోవడం అక్కడున్న వారి హృదయాలను తాకింది. దీంతో, స్టార్‌బక్స్ సిబ్బంది.. చిన్నారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పానీయాన్ని ఇచ్చారు. ‘‘చిన్నారికి బేబేచీనో ఇవ్వడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. చిన్నారి మోముపై నవ్వు చూసి మా మనసులు సంతోషంతో నిండిపోయాయి. సోనూ కష్టం చూస్తుంటే మానవాళి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోగలరన్న నమ్మకం కలుగుతోంది. సోనూ కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని, సిరిసంపదలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము’’ అని స్టోర్ మేనేజర్ పేర్కొన్నరు.


ఘటనపై జొమాటో కూడా స్పందించింది. తమ డెలవరీ ఏజెంట్ కష్టాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపింది. అతడికి ఈ ప్రశంసలు చేరేలా చేస్తామని కూడా పేర్కొంది. మరోవైపు, నెటిజన్లు కూడా సోనూపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి ఆర్థిక కష్టాలు కొంతైనా తీరేలా ఆన్‌లైన్‌లో నిధుల సేకరణ చేపట్టాలని అన్నారు. ఇలాంటి వారి పట్ల సహృదయతతో వ్యవహరిస్తే సమాజంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Read Latest and Viral News

Updated Date - Sep 05 , 2024 | 01:34 PM

Advertising
Advertising