Stock Market: రోజంతా లాభాలు.. చివర్లో అమ్మకాలతో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!
ABN, Publish Date - Apr 30 , 2024 | 04:35 PM
రోజంతా లాభాల్లో కదలాడిన సూచీలు చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాలను మూటగట్టుకున్నాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో చివరి అరగంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో దేశీయ సూచీలు నష్టాలను కళ్ల జూశాయి.
రోజంతా లాభాల్లో కదలాడిన సూచీలు చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాలను మూటగట్టుకున్నాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో చివరి అరగంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో దేశీయ సూచీలు నష్టాలను కళ్ల జూశాయి. ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా లాభాల్లోనే కదలాడాయి. చివర్లో ఒక్కసారిగా పరిస్థితి మారడంతో నష్టాల్లోకి జారుకున్నాయి (Business News).
అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఓ దశలో 75,111 వద్ద ఇంట్రాడే హైని తాకింది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో చివరకు 188 పాయింట్ల నష్టంతో 74,482 వద్ద రోజును ముగించింది. నిఫ్టీ కూడా 38 పాయింట్లు కోల్పోయి 22,604 వద్ద రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 27 పాయింట్లు నష్టపోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 33 పాయింట్ల స్వల్ప లాభాన్ని ఆర్జించింది.
సెన్సెక్స్‌లో ప్రధానంగా మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫిన్‌సెర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాలను ఆర్జించాయి. టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సన్‌ఫార్మా షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.43గా ఉంది. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా బుధవారం దేశీయ సూచీలకు సెలవు.
ఇవి కూడా చదవండి..
E-Bike: రూ.57 వేలకే ప్రముఖ ఈ బైక్.. ఆఫర్, సబ్సిడీ గురించి తెలుసా
IRCTC: భక్తులకు గుడ్ న్యూస్.. జ్యోతిర్లింగాల దర్శనం కోసం స్పెషల్ యాత్ర
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 30 , 2024 | 04:35 PM