మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: టీచర్ పాఠాలు చెబుతుంటే.. వెనుక ఈ విద్యార్థి చేసిన పనికి అవాక్కయిన అమ్మాయిలు..

ABN, Publish Date - Feb 03 , 2024 | 08:28 PM

పాఠశాల తరగతి గదుల్లో విద్యార్థులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. టీచర్ పాఠాలు చెబుతుంటే.. నిద్రపోయేవారు కొందరైతే.. మరికొందరు తోట విద్యార్థులతో ముచ్చట్లు పెడుతుంటారు. అయితే....

Viral Video: టీచర్ పాఠాలు చెబుతుంటే.. వెనుక ఈ విద్యార్థి చేసిన పనికి అవాక్కయిన అమ్మాయిలు..

పాఠశాల తరగతి గదుల్లో విద్యార్థులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. టీచర్ పాఠాలు చెబుతుంటే.. నిద్రపోయేవారు కొందరైతే.. మరికొందరు తోట విద్యార్థులతో ముచ్చట్లు పెడుతుంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా యుగానికి తగినట్లుగా విద్యార్థుల ప్రవర్తన రోజు రోజుకూ మరీ విచిత్రంగా మారిపోతోంది. కొందరు వ్యూస్, లైక్‌ల కోసం కావాలనే పిచ్చి పిచ్చి పనులు చేయడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. క్లాస్ రూంలో టీచర్ పాఠాలు చెబుతుండగా.. వెనుక వైపు విద్యార్థి చేసిన పనికి యువతులంతా షాక్ అయ్యారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఫ్లోరిడాలోని (Florida) అట్లాంటిక్ యూనివర్శిటీలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఓ క్లాస్ రూంలో సైన్స్ టీచర్ పాఠాలు చెబుతుంటాడు. విద్యార్థులంతా శ్రద్ధగా పాఠాలు వింటుంటారు. అయితే వారిలో ఓ విద్యార్థి మాత్రం అందుకు విరుద్ధంగా గది చివరకు వెళ్లి అందరికీ షాక్ ఇచ్చాడు. టీచర్ పాఠాలు చెబుతండగానే.. సదరు విద్యార్థి అర్ధనగ్నంగా మారి ఏకంగా (student bathing in classroom) బకెట్ పెట్టి స్నానం చేయడం మొదలెట్టాడు. శరీరానికి మొత్తం సబ్బు నురగ పెట్టుకుని టీచర్ వైపు చూస్తూ కామెంట్ చేశాడు.

Viral Video: లక్కీ ఛాన్స్ కొట్టాడుగా.. వధువు పక్కన వరుడి ఎక్స్‌ప్రెషన్ చూడగానే.. నెటిజన్ల రియాక్షన్ ఇదీ..

అంతవరకూ సైలెంట్‌గా కూర్చుని పాఠాలు వింటున్న యువతులు.. ఈ విద్యార్థి చేసిన పని చూసి అవాక్కయ్యారు. ఆ విద్యార్థి అలా స్నానం చేస్తున్నా టీచర్ ఏమాత్రం స్పందించలేదు. తన మానన తాను పాఠాలు చెబుతూనే ఉన్నాడు. టీచర్‌ను సరదాగా ఆటపట్టించేందుకే ఇలా చేశానని విద్యార్థి తెలిపాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇదెక్కడి సరదారా నాయనా’’.. అంటూ కొందరు, ‘‘ఏంటో విద్యార్థులు రోజు రోజుకూ ఇలా తయారువుతున్నారు’’.. అంటూ మరికొందరు, ‘‘క్లాస్ రూమ్‌ని చివరికి బాత్రూం చేసేశావు కదరా’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 26వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ పక్షుల తెలివి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. వ్యక్తి గడ్డికి నిప్పు పెట్టగానే.. ఏం చేశాయో చూడండి..

Updated Date - Feb 03 , 2024 | 08:28 PM

Advertising
Advertising