ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఆడ గొరిల్లాల మధ్య పంచాయితీ, మగ గొరిల్లా ఎలా సెటిల్ చేసిందో చూస్తే..

ABN, Publish Date - Jul 18 , 2024 | 10:13 PM

రెండు గొరిల్లాల మధ్య తలెత్తిన ఓ గొడవను మగ గొరిల్లా పరిష్కరించిన తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: జన్యుపరంగా మానవుడికి అతి దగ్గరగా ఉండే జంతువుల్లో గొరిల్లాలు ఒకటి. ఇతర కోతుల్లా కాకుండా మనిషిని పోలిన భారీ శరీరాలు ఉండే వీటిని గ్రేట్ ఏప్స్ అని పిలుస్తుంటారు. ఇక మనుషుల్లాగే గొరిల్లాలు కూడా అనేక భావోద్వేగాలను ప్రదర్శిస్తుంటాయి. ఇవి బృందాలుగా ఏర్పడి సంక్లిష్ట సమాజంగా జీవిస్తాయి. అయితే, వాటి సామాజిక జీవనం ఎలా ఉంటుందో చెప్పే ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది.

Viral: వీధుల్లో గర్భవతి భిక్షాటన! ఆమె ముందు యువకుడి డాన్స్! ఎందుకో తెలిస్తే..

గొరిల్లాల్లో కూడా ఈర్ష్య, అసూయ, అకారణ ద్వేషం వంటివి భావావేశాలు కనిపిస్తుంటాయి. గొరిల్లా గుంపుకు సాధారణంగా ఓ మగ గొరిల్లా నాయకత్వం వహిస్తుంది. గుంపులో జరిగే గొడవలు పంచాయితీలను అదే పరిష్కరిస్తుంది. మధ్యవర్తిత్వం కుదరకపోతే బలప్రదర్శన చేసి గొడవలు కట్టుతప్పకుండా ఆదిలోనే నిరోధిస్తుంది. ఇటీవలో ఓ జూలో సరిగ్గా ఇదే జరిగింది.


జూలోని రెండు ఆడ గొరిల్లాల మధ్య అకస్మాత్తుగా గొడవ తలెత్తింది. బిడ్డతో ఉన్న ఓ గొరిల్లాపై మరో గొరిల్లా సడెన్‌గా దాడి చేసింది. దీంతో, తల్లి గొరిల్లా ఒక్కసారిగా బోల్తా పడింది. అయితే, అలజడిని గమనించగానే మగ గొరిల్లా రంగంలోకి దిగింది. వాస్తవానికి గొడవ మొదలయ్యే సమయానికి గొరిల్లా మరోవైపు తిరిగి ఉన్నా, ఎవరు ఎవరిపై దాడి చేశారో చూడకపోయినా, అది క్షణాల్లో తప్పెవరిదో గుర్తించింది. దాడి చేసిన ఆడ గొరిల్లాపై తన బలమంతా ప్రదర్శించి నేలకేసి అదిమిపెట్టింది. అదే సమయంలో దానికి తీవ్రగాయాలేవీ కాకుండా జాగ్రత్త పడింది. దాని ఆవేశం చల్లారాక మెల్లాగా దాన్ని వదిలిపెట్టింది. ఆడ గొరిల్లాకు ఏదో నచ్చచెప్పి శాంత పరిచినట్టు ఉందా సీన్.

వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు షాకైపోతున్నారు. మగ గొరిల్లాకు తన వెనక ఏం జరిగిందో ఎలా గుర్తించిందంటూ పలువురు ఆశ్చర్యపోయారు. దాని నాయకత్వ లక్షణాలు సూపర్ అని కొందరు అన్నారు. ఇవి కూడా తమ మధ్య గొడవలను కట్టుతప్పకుండా చూసుకుంటాయనమాట అని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Jul 18 , 2024 | 10:14 PM

Advertising
Advertising
<