Viral News: 240 కి.మీ వేగంతో గాలులు
ABN, Publish Date - Sep 09 , 2024 | 06:42 PM
సూపర్ టైఫూన్ యాగితో డ్రాగన్ చైనా చిగురుటాకులా వణుకుతోంది. చైనాతో పాటు వియత్నాం, ఫిలిప్పీన్స్‌పై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో రోడ్డు మీద ఉన్న వ్యక్తులు ఎగిరిపోయారు. ఇంటి పై కప్పులో ఉన్న రేకులు ఊడిపోయాయి.
సూపర్ టైఫూన్ యాగితో (Super Typhoon Yagi) డ్రాగన్ చైనా చిగురుటాకులా వణుకుతోంది. చైనాతో పాటు వియత్నాం, ఫిలిప్పీన్స్‌పై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో రోడ్డు మీద ఉన్న వ్యక్తులు ఎగిరిపోయారు. ఇంటి పై కప్పులో ఉన్న రేకులు ఊడిపోయాయి. పెంట్ హౌస్ వద్ద ఉన్న అద్దాలు పగిలిపోయాయి. ఫర్నీచర్ ధ్వంసమైంది. యాగి తుఫాన్ బీభత్సానికి సంబంధించి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో చూస్తేనే వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి నెలకొంది. టైఫూన్ యాగి ఈ ఏడాదిలో అత్యంత శక్తివంత తుఫాన్ అని అధికారులు వివరించారు.
ఎగిరిపోయిన బాల్కనీ
బలమైన గాలులు వీయడంతో స్కూటర్ మీద కూర్చొన్న మహిళ నేలపై పడిపోయింది. మరో వీడియోలో పెట్టేలు వణకడం గమనించొచ్చు. బాల్కనీ ఎగిరిపోవడంతో అక్కడున్న వారు షాకయ్యారు. వీధుల్లో ఉన్న కొందరు, ఇంట్లో ఉన్న మరికొందరు భీకర గాలులతో భయాందోళనకు గురయ్యారు. ఆ వీడియోలో స్థానికుల ఫీలింగ్స్ చూడొచ్చు. నదిలో అలల ఒడ్డున నిలబడి ఉన్న వారిని చూడొచ్చు. సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. బలమైన గాలులు వీయడంతో ఆ గాలులతో నీటిలో కొట్టుకుపోయారు. ఆ వీడియోలో వారు కొట్టుకుపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.
హతవిధి..
టైఫూన్ యాగీ శనివారం ఉత్తర వియత్నాంను తాకింది. 203 కి.మీ వేగంతో గాలులు హై ఫాంగ్ మరియు క్వాంగ్ నిన్హ్ ప్రావిన్సులను తాకాయి. ఆ సమయంలో నలుగురు చనిపోయారు. 78 మంది గాయపడ్డారు. ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చైనాలో ఎప్పటి లాగే ఉండాలని, ఎవరి ప్రాణాలు, ఆస్తులకు హానీ కలగకుండా ఉండాలని నా దేవుడిని ప్రార్థిస్తున్నానని ఓ యూజర్ వీడియోకు కామెంట్ చేశాడు.
ఇది కూడా చదవండి:
Viral News: పులికి ముద్దులు.. తిరిగి పులి ఏం చేసిందంటే
Viral News: 14 ఏళ్ల బాలిక.. బాహుబలిలా మారి..
Viral News: అండర్ వేర్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి.. చివరికి
Updated Date - Sep 09 , 2024 | 06:43 PM