Share News

Viral News: నిర్ఘాంతపరిచే ఘటన.. త్రిశూలంతో నాన్నమ్మను పొడిచి చంపి ఆమె రక్తాన్ని..

ABN , Publish Date - Oct 20 , 2024 | 04:37 PM

ఛత్తీస్‌గఢ్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ 30 ఏళ్ల యువకుడు తన నానమ్మను దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత అతడు చేసిన పని అందరినీ నిర్ఘాంతపరుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Viral News: నిర్ఘాంతపరిచే ఘటన.. త్రిశూలంతో నాన్నమ్మను పొడిచి చంపి ఆమె రక్తాన్ని..
Chattishgarh

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో నిర్ఘాంతపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన నానమ్మను త్రిశూలంతో పొడిచి చంపి ఆమె రక్తాన్ని శివ లింగానికి అర్పించాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనుమానాస్పద నరబలి కేసుగా నమోదయిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

దుర్గ్ జిల్లాలోని నందిని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నన్‌కట్టి గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్పారు. మూఢనమ్మకాలతో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నామని, ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారి సంజయ్ పుంధీర్ వివరించారు.


మృతురాలి పేరు రుక్మిణి గోస్వామిగా (70) గుర్తించామని, హత్యకు పాల్పడిన మనవడు పేరు గుల్షన్ గోస్వామి(30 ఏళ్ల ) పోలీసులు తెలిపారు. గుల్షన్ తన నాన్నమ్మతో కలిసి శివాలయం సమీపంలోని ఓ ఇంట్లో నివసిస్తుండేవాడని, ఆలయంలో నిత్యం పూజలు నిర్వహించేవాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. శనివారం సాయంత్రం నిందితుడు గుల్షన్ తన నానమ్మ రుక్మిణిపై త్రిశూలంతో దాడి చేశాడని, ఆమె చనిపోయాక ఆలయంలోని ‘శివలింగం’పై రక్తాన్ని అర్పించాడని వివరించారు. ఆ తర్వాత గుల్షన్ ఇంటికి వెళ్లి అదే త్రిశూలంతో తన మెడపై పొడుచుకున్నాడని, తీవ్రమైన గాయాలపాలయ్యాడని అధికారులు తెలిపారు.


రక్తపు మడుగులో పడివున్న వృద్ధురాలిని స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో విషయం తమ దృష్టికి వచ్చిందని పోలీసులు చెప్పారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని, తీవ్రంగా గాయపడిన గుల్షన్ ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతుందని, మూఢనమ్మకాలతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా తెలుస్తోందని అధికారులు ఆదివారం మీడియాకు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

మంత్రి ఇంట్లోకి చొరబడ్డ వైసీపీ నేత.. ఆ తరువాత ఏమైందంటే..

కివీస్ చేతిలో అనూహ్య ఓటమి.. భారత్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఎలా

For more Viral News and AP News and Telugu News

Updated Date - Oct 20 , 2024 | 05:24 PM