ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: భార్యపై డౌట్‌తో పడక గదిలో సీక్రెట్ కెమెరాలు! చివరకు ఏమైందో తెలిస్తే..

ABN, Publish Date - Aug 23 , 2024 | 04:52 PM

భార్య వివాహేతర సంబంధాన్ని రుజువు చేసేందుకు ఓ భర్త చేసిన ప్రయత్నం చివరకు అతడిని జైలు పాలు చేసింది. బాధితుడి ఉదంతం విన్న నెటిజన్లు అతడిపై జాలి కురిపిస్తున్నారు. పాపం.. అంటూ నిట్టూరుస్తున్నారు.

Man Trying To Catch His Cheating Wife Red-handed Jailed

ఇంటర్నెట్ డెస్క్: చట్టాలపై పూర్తి అవగాహన లేకుండా దూసుకెళ్లిపోతే అనర్థాలు ఎదురవుతాయనేందుకు ఉదాహరణగా తైవాన్‌లో తాజాగా షాకింగ్ ఘటన (Viral) వెలుగు చూసింది. భార్య వివాహేతర సంబంధాన్ని రుజువు చేసేందుకు ఓ భర్త చేసిన ప్రయత్నం చివరకు అతడిని జైలు పాలు చేసింది. బాధితుడి ఉదంతం విన్న నెటిజన్లు అతడిపై జాలి కురిపిస్తున్నారు. పాపం.. అంటూ నిట్టూరుస్తున్నారు.

Viral: చావుతో చలగాటమంటే ఇదే! జూకు వచ్చిన ఈ తింగరి మహిళ ఏం చేసిందో చూస్తే..


పూర్తి వివరాల్లోకి వెళితే, తైవాన్‌లో నివసించే ఫాన్ అనే వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల క్రితం అతడికి భార్యపై అనుమానం మొదలైంది. ఆమె బండారం బయటపెట్టాలనే ఉద్దేశంతో అతడు బెడ్‌రూం, హాల్‌లో పలుచోట్ల సీక్రెట్ కెమెరాలు అమర్చాడు. దీంతో, అతడి అనుమానం నిజమని తేలింది. అతడి భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. ఈ వీడియోలను భార్యకు చూపించిన అతడు తొలుత సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె మొండికెత్తడంతో చివరకు అతడు వీడియోలే ఆధారంగా కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, అతడు ఊహించని విధంగా కోర్టులో కథ అడ్డం తిరిగింది.


ఫాన్ భార్య అతడికి న్యాయస్థానంలోనూ చుక్కలు చూపించింది. రహస్య కెమెరాలు పెట్టిన భర్త తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించాడని ఆరోపించింది. ఆమె వాదనతో ఏకీభవించిన కోర్టు అతడికి తాజాగా మూడు నెలల కారాగార శిక్ష విధించింది. ఈ సందర్భంగా ఫాన్ చేసిన వాదనలను కోర్టు తోసి పుచ్చింది. భార్య నిత్యం బెడ్‌రూంలో గడుపుతుండటంతో పిల్లలు ఏం జరుగుతోందో తెలీక తల్లడిల్లిపోయేవారని, విషయం ఏంటో తెలుసుకునేందుకు కెమెరాలు పెట్టాల్సి వచ్చిందన్న అతడి వాదనను కోర్టు నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది. దీంతో, అతడికి జైలు శిక్ష పడింది.

ఈ ఉదంతం సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. భార్య మోసం చేస్తే భర్త జైలు పాలవడం ఏంటని అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాధితుడైన భర్తను కోర్టు దోషిగా తేల్చడాన్ని పలువురు జీర్ణించుకోలేకపోయారు. రకరకాల కామెంట్స్‌తో సోషల్ మీడియాలో కలకలం రేపారు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.

Read Viral and Telugu News

Updated Date - Aug 27 , 2024 | 06:20 PM

Advertising
Advertising
<