Tea Strainer: టీ స్ట్రైనల్ నల్లగా మారిపోయిందా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే కొత్తదానిలా మెరిసిపోతుంది!
ABN , Publish Date - Feb 22 , 2024 | 03:02 PM
టీ స్ట్రైనర్ కొత్తలో కొన్నప్పుడు తెల్లగా మెరుస్తూ ఉంటాయి. కానీ వాడే కొద్దీ నల్లగా మారిపోతాయి. ఈ టిప్స్ తో వాటిని కొత్తగా మెరిపించవచ్చు.
భారతీయుల ప్రతి ఇంట్లో టీ స్ట్రైనర్ ఉంటుంది. ఇవి కొత్తలో కొన్నప్పుడు తెల్లగా మెరుస్తూ ఉంటాయి. కానీ వాడే కొద్దీ నల్లగా మారిపోతాయి. ఈ నలుపు వదిలించడానికి చాలాసార్లు లిక్విడ్ సోపును, డిష్ వాష్ సోప్ ను చాలా ఉపయోగిస్తారు. కానీ ఆశించిన ఫలితం అయితే ఉండదు. అయితే ఈ టీ స్ట్రైనర్ ఎంత నల్లగా ఉన్నా సరే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే కొత్తదానిలా మిలమిలా మెరుస్తుంది. ఇంతకీ ఆ సింపుల్ టిప్స్ ఏంటో ఓసారి చూస్తే..
టీ స్ట్రైనర్ నలుపు తగ్గించడానికి మొదటి మార్గం..
మొదటగా డిష్ వాష్, స్క్రబ్బర్, నిమ్మరసం తీసుకోవాలి. స్క్రబ్బర్ ను నిమ్మరసంలో ముంచి స్ట్రైనర్ ను బాగా తోమాలి.
ఒక పాత్ర స్టౌ మీద పెట్టి అందులో నీటిని పోసి, కాసింత నిమ్మరసం కలిపాలి. ఈ నీటిని మరిగించాలి. ఇలా మరుగుతున్న నీటిలో స్ట్రైనర్ వేసి సుమారు 10నిమిషాలు అలాగే మంటమీద ఉంచాలి.
స్ట్రైనర్ బాగా ఉడికిన తరువాత డిష్ వాష్, స్క్రబ్బర్ సహాయంతో మళ్లీ తోమాలి. ఇలా చేస్తే స్ట్రైనర్ కొత్తదానిలా మెరుస్తుంది.
ఇది కూడా చదవండి: రోజూ రాత్రి పడుకునేముందు గోరువెచ్చని పాలు తాగితే.. కలిగే లాభాలివే..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.