ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: టైం వేస్ట్.. ఐఫోన్ 16 ప్రోపై టెకీ తీవ్ర అసంతృప్తి! కారణం ఏంటంటే..

ABN, Publish Date - Oct 05 , 2024 | 09:06 AM

తాజా ఐఫోన్ సిరీస్‌ ఆశించిన స్థాయిలో లేదంటూ ఓ వ్యక్తి నెట్టింట పంచుకున్న అభిప్రాయం సంచలనంగా మారింది. ఫేస్‌బుక్‌ తొలినాళ్లల్లో ఇంజినీర్‌గా పని చేసిన ఆదిత్య అగర్వాల్ ఈ కామెంట్ చేశాడు. దీంతో, ఈ ఉదంతంపై నెట్టింట చర్చ జరుగుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: తాజా ఐఫోన్ సిరీస్‌ ఆశించిన స్థాయిలో లేదంటూ ఓ వ్యక్తి నెట్టింట పంచుకున్న అభిప్రాయం సంచలనంగా మారింది. ఫేస్‌బుక్‌ తొలినాళ్లల్లో ఇంజినీర్‌గా పని చేసిన ఆదిత్య అగర్వాల్ ఈ కామెంట్ చేశాడు. దీంతో, ఈ ఉదంతంపై నెట్టింట చర్చ నడుస్తుండగా అనేక మంది అతడి అభిప్రాయంతో ఏకీభవించారు (Tech News).

Canada: కెనడాలో దారుణం.. ఏ ఎన్నారైకీ ఈ కష్టం రాకూడదు!

భారీ హంగూఆర్భాటాలతో వివాహాలు ఇప్పుడు సాధారణమైపోయాయి కానీ 2010లో ఆదిత్య తన పెళ్లితో సంచలనం సృష్టించాడు. అత్యంత ఖరీదైన వేడుకగా ఈ పెళ్లి అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. అగర్వాల్ పెళ్లికి ఏకంగా మార్క్ జుకర్‌బర్గ్ కూడా హాజరయ్యారంటే అతడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. టెక్ రంగంలో గొప్ప అనుభవం ఉన్న అగర్వాల్ తాజా ఐఫోన్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టైం వేస్ట్ అని తేల్చి పడేశారు (Tech Expert Disappointed With iPhone 16 Pro Calls It Waste Of Time).


Viral: భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టంలేని భర్త.. జడ్జి చూస్తుండగానే ఆమెను..

‘‘ఐఫోన్ 14 ప్రో నుంచి ఐఫోన్ 16 ప్రోకు అప్‌గ్రేడ్ అయ్యా. కానీ రెండిటి మధ్యా తేడానే తెలీలేదు. కొత్త ఫోన్‌ను సెట్ చేసుకునేందుకే నాకు 24 గంటల పట్టింది. అంతా టైం వేస్ట్ అని అనిపించింది. ‘యాపిల్ ఇంటెలిజెన్స్’ అని గొప్పగా చెప్పుకున్నారు కదా! మరి అది ఫోన్‌లో ఎక్కడా లేదుగా’’ అంటూ ఐఫోన్ 16 తీరును ఎండగట్టారు’’ దీనికి బదులిచ్చిన ఓ నెటిజన్ యాపిల్ ఇంటెలిజెన్స్ అప్‌డేట్ త్వరలో విడుదల అవుతుందని, ఈ విషయాన్ని యాపిల్ ముందే చెప్పిందని గుర్తు చేశాడు. దీనికి అగర్వాల్ స్పందిస్తూ..మాటలు కాదు చేతల్లో చూపించాలి. ఏదో చేస్తామనడం కాదు ఉత్పత్తిని రెడీ చేసి పంపించాలి’’ అంటూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Viral: ఇలాంటి వ్యక్తికి రూ.65 లక్షల శాలరీనా! గూగుల్ ఆఫర్‌కు జనాలు షాక్


దీనిపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది అగర్వాల్ అభిప్రాయంతో ఏకీభవించారు. ఒకప్పుడు కొత్త ఫోన్, లాప్‌టాప్ కొంటే ఎంతో ఉత్సాహంగా ఉండేదని, కొత్త ఫీచర్లు ఏమున్నాయా అని ఆతృతగా ఎదురు చేసేవారమని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మాత్రం కొత్త ఫోన్లు కొంటుంటే ఏదో వాషింగ్ మెషీన్ కొన్నట్టు ఉందని పెదవి విరిచారు. తానూ ఐఫోన్ 12 నుంచి ఐఫోన్ 16కు మారానని, కానీ రెండిటికీ మధ్య పెద్దగా తేడా ఏమీ లేదని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. ప్రతి యాప్‌లోనూ మళ్లీ లాగిన్ కావడం నిజంగా ఇబ్బంది పెట్టిందని వివరించాడు. కొత్త ఫోన్లు కొనాలనుకున్న వారు నూతన డిజైన్లు, ఫీచర్లు, సైజ్ ఉన్న వాటిని ఎంచుకుంటేనే సంతోషం కలుగుతుందని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నట్టు మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండ్ అవుతోంది.

Viral: ‘నాన్నా! నాకు యాక్సిడెంట్ అయ్యింది’ అంటూ ఫోన్! తండ్రికి డౌట్ రావడంతో..

Read Latest and Viral News

Updated Date - Oct 05 , 2024 | 09:14 AM