Thailand: కొండ చిలువతో వృద్దురాలు రెండు గంటల పోరాటం.. చివరకు ఏం జరిగిందంటే..?
ABN, Publish Date - Sep 20 , 2024 | 10:16 AM
దాదాపు రెండు గంటల పాటు కొండ చిలువతో పోరాడి పోలీసుల సహాయంతో తన ప్రాణాలను దక్కించుకుంది ఓ మహిళ. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు దక్షిణ ప్రావిన్స్‌లోని సముత్ ప్రకాశ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
బ్యాంకాక్, సెప్టెంబర్ 20: దాదాపు రెండు గంటల పాటు కొండ చిలువతో పోరాడి పోలీసుల సహాయంతో తన ప్రాణాలను దక్కించుకుంది ఓ మహిళ. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు దక్షిణ ప్రావిన్స్‌లోని సముత్ ప్రకాశ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. 64 ఏళ్ల ఆరోమ్.. వంటగదిలో వంట చేసుకుంటుంది. ఆ క్రమంలో మంచి నీళ్లు కోసం కిందకు వంగింది. ఆమె కాలిని ఏదో కుట్టినట్లు అనిపించింది. తీరా చూస్తే 18 అడుగుల కొండ చిలువ. అంతలోనే కొండ చిలువ ఆమె శరీరాన్ని చుట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది.
దాంతో భయంతో బిగ్గరగా కేకలు వేసింది. కానీ వెంటనే ఇరుగు పొరుగు వారెవరు స్పందించ లేదు. చివరకు ఒకరు మాత్రం స్పందించి.. ఇంట్లోకి వచ్చి చూశారు. ఆ దృశ్యాన్ని చూసి నిర్ఘాంత పోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో కొండ చిలువ నుంచి విడిపించుకొనేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించింది. కానీ సాధ్యపడలేదు. కొండ చిలువ మాత్రం ఆమెను మరింత గట్టిగా చుట్టేసిందుకు ప్రయత్నిస్తోంది. పోలీసులతోపాటు జంతువుల నియంత్రణ అధికారులు సైతం ఆరోమ్ నివాసానికి చేరుకున్నారు. ఆ క్రమంలో ఆరోమ్‌ను విడిపించేందుకు పోలీసులు పాము తలపై ఆయుధంతో బలంగా కొట్టారు.
అంతలో కొండ చిలువ అప్రయత్నంగా మహిళను విదిలి వేసింది. ఆ వెంటనే కొండ చిలువ సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోయింది. దాదాపు రెండు గంటల పాటు కొండ చిలువ చేతిలో చిక్కిన ఆరోమ్.. ప్రాణాలతో బయటపడినట్లయింది. అయితే అప్పటికే ఆరోమ్‌ను కొండ చిలువ పలుమార్లు కాటు వేసింది. దీంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
థాయ్‌లాండ్‌లో దాదాపు 250 పాము జాతులున్నాయి. అందులో కొండ చిలువలకు సంబంధించి మూడు జాతులున్నాయి. ఇక గతేడాది దాదాపు 12 వేల మంది ప్రజలు పాములు, జంతువుల కాటుకు గురయ్యారని థాయ్‌లాండ్ జాతీయ ఆరోగ్య భద్రత కార్యాలయం వెల్లడించింది. అలాగే గతేడాది పాము కాటుకు గురై 26 మంది మరణించారని పేర్కొంది.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 20 , 2024 | 10:18 AM