ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఆ యువకుడి ధైర్యసాహసాలు హీరోని చేశాయి.. ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు

ABN, Publish Date - Aug 24 , 2024 | 01:13 PM

అగ్ని ప్రమాదం జరిగేందుకు ఈ ప్రాంతం.. ఆ ప్రాంతమన్న తేడా లేదు. ఎక్కడైనా జరిగేందుకు అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఏదైనా మార్కెట్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగితే పెను విపత్తుకు దారి తీస్తుంది.

అగ్ని ప్రమాదం జరిగేందుకు ఈ ప్రాంతం.. ఆ ప్రాంతమన్న తేడా లేదు. ఎక్కడైనా జరిగేందుకు అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఏదైనా మార్కెట్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగితే పెను విపత్తుకు దారి తీస్తుంది. ఈ ప్రదేశాలు రద్దీగా ఉండటమే దీనికి కారణం. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా అక్కడి నుంచి పారిపోయేందుకే ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ముందుకొచ్చి మంటలను ఆర్పే సాహసం అయితే ఎవరూ చేయరు. పైగా సిలిండర‌కు మంట అంటుకుంటే మాత్రం ఆ దరిదాపుల్లో కూడా ఉండరు. ఎందుకంటే సిలిండర్ బ్లాస్ట్ అయితే జరిగే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం సిలిండర్ నుంచి మంట వస్తుంటే ఏమాత్రం వెనుకడుగు వేయకుండా వెళ్లి మంటలను ఆర్పేందుకు యత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయంలో క్లారిటీ లేదు. అత్యంత రద్దీ ప్రాంతమైన ఓ మార్కెట్‌లో తోపుడు బండ్ల వద్ద ఒక్కసారిగా సిలిండర్‌కు మంటలు అంటుకున్నాయి. అది చూసిన వారంతా పరుగు లంకించుకున్నారు. ఓ యువకుడు మాత్రం పరిగెత్తుకుంటూ సిలిండర్ వద్దకు వెళ్లాడు. మంటలు వెదజల్లుతున్నా కూడా ఏమాత్రం బెరుకు లేకుండా సిలిండర్‌‌ నాబ్ ఆఫ్ చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే అతనికి గాయాలయ్యాయి. అయినా సరే తన ప్రయత్నాన్ని మాత్రం వీడలేదు. మరో వ్యక్తి కాస్త సాయమందించడంతో ఎలాగైతేనేం చివరకు సిలిండర్ నాబ్ ఆఫ్ చేశాడు. మంటలు ఆగిపోయిన తరువాత అంతా అభినందిస్తున్నా కూడా చిరునవ్వుతో ఏదో తన కర్తవ్యాన్ని నిర్వర్తించాను.. తాను అంతకు మించి చేసిందేమీ లేదన్నట్టుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.


సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. కొంతమంది వ్యక్తులు సదరు యువకుడు పట్టువదలని విక్రమార్కుడిలా మంటలు ఆర్పుతుండటాన్ని కళ్లు రెండితలు చేసుకుని చూస్తూ ఉండిపోయారు. కొందరేమో కెమెరాలకు పని చెప్పారు. మంటలను ఆర్పివేసిన అనంతరం సదరు యువకుడు అలా వస్తుండగా అతడిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన క్షణాల్లోనే బీభత్సంగా వైరల్ అయ్యింది. దాదాపు 48 లక్షల వ్యూస్ వచ్చాయి. 4 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై ఇక కామెంట్స్ అయితే వేలల్లో వస్తున్నాయి. ‘‘మీలాంటి ధైర్యవంతులు మాకు కావాలి బ్రదర్, గ్రేట్ జాబ్” అని నెటిజన్ ప్రశంసించాడు. “మీ ముఖంలో విశ్వాసం, ప్రశాంతత చెక్కు చెదరలేదు. మీరు అక్కడ చాలా మందిని రక్షించారు’’ అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ‘‘బ్రదర్ ఫేస్‌లోని మెరుపు అతని గొప్ప వ్యక్తిత్వాన్ని చెబుతోంది’’ అని ఇంకో నెటిజన్ పేర్కొన్నాడు. మొత్తానికి ఒకే ఒక్క పనితో సదరు యువకుడు హీరో అయిపోయాడు.

Updated Date - Aug 24 , 2024 | 01:13 PM

Advertising
Advertising
<