Viral Video: బ్యాక్ బెంచ్ స్టూడెంట్.. ఆ కుర్రాడి ట్యాలెంట్‌కు టీచర్ ఫిదా.. చివరకు ఏం చేసిందో చూడండి..!
ABN, Publish Date - Aug 27 , 2024 | 06:03 PM
ఒక తరగతిలోని పిల్లలందరూ ఒకేలా చదవలేరు. ఒక్కొక్కరికీ ఒక్కో అంశంపై ఆసక్తి ఉంటుంది. పిల్లల ఆసక్తులు ఏంటో తెలుసుకుని ప్రోత్సహించాల్సిన బాధ్యత టీచర్‌పై ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుర్రాడు తన అద్భుత ట్యాలెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఒక తరగతిలోని (Class) పిల్లలందరూ ఒకేలా చదవలేరు. ఒక్కొక్కరికీ ఒక్కో అంశంపై ఆసక్తి ఉంటుంది. పిల్లల ఆసక్తులు ఏంటో తెలుసుకుని ప్రోత్సహించాల్సిన బాధ్యత టీచర్ (Teacher)పై ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుర్రాడు తన అద్భుత ట్యాలెంట్‌తో (Talent) తన క్లాస్ స్టూడెంట్స్, టీచర్‌నే కాకుండా ఎంతో మంది నెటిజన్లను కూడా ఆశ్చర్యపరిచాడు. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వారు ఆ కుర్రాడిపై, అతడి ట్యాలెంట్‌ను ప్రోత్సహించిన టీచర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు (Viral Video).
raieheema అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ క్లాస్ రూమ్ కనిపిస్తోంది. టీచర్ ఓ కుర్రాడిని పిలిచి ``నీ ట్యాలెంట్ చూపించు`` అని అడిగింది. మొదట ఆ కుర్రాడు సిగ్గుపడ్డాడు. టీచర్ బలవంతపెట్టడంతో ఆ కుర్రాడు తన చేతులతో అచ్చం గుర్రం (Horse) పరుగెడుతున్నట్టు శబ్దం వచ్చేలా చేశాడు. అనంతరం గుర్రంలా సకిలించాడు. ఆ కుర్రాడి ట్యాలెంట్ చూసిన తర్వాత క్లాసులోని విద్యార్థులందరూ చప్పట్లతో అభినందించారు. అనంతరం టీచర్ ఆ కుర్రాడిని అభినందిస్తూ ఓ చాక్లెట్ ఇచ్చారు.
ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోకు కోట్లలో వ్యూస్ వచ్చాయి. 23 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ప్రతిభ ఏదయినా సరే, దానికి ఇంత విలువ ఇవ్వాలి``, ``ఆ కుర్రాడు కచ్చితంగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయ్యుంటాడు``, ``పిల్లలు మనస్ఫూర్తిగా తమ స్నేహితుడిని అభినందించారు`` అంటూ కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Picture Puzzle: మీ కళ్లు సూపర్ పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో గోల్ఫ్ బాల్‌ను 8 సెకెన్లలో కనిపెట్టండి..!
Viral Video: నాగుపాము పడగ విప్పితే.. పెద్ద పులి అయినా తోకముడవాల్సిందే.. వీడియో వైరల్!
Viral: ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే జిలేబీ తెమ్మన్నారు.. అసలు కథ ఏంటంటే..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 28 , 2024 | 03:10 PM