ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: వామ్మో.. గుడిసెలా కనిపిస్తున్న ఈ ఇల్లు లోపలికెళ్లి చూస్తే..

ABN, Publish Date - May 17 , 2024 | 05:37 PM

మట్టితో చేసిన ఓ ఇంటి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చూడటానికి ఓ గుడిసెలా ఉన్న ఇంటి లోపలి తీరుతెన్నులు చూసి జనాలు షాకైపోతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: మట్టితో చేసిన ఓ ఇంటి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral ) అవుతోంది. చూడటానికి ఓ గుడిసెలా ఉన్న ఇంటి లోపలి తీరుతెన్నులు చూసి జనాలు షాకైపోతున్నారు. ఇంట్లోకి మొదటిసారి వెళ్లే వారెవరికైనా షాక్ తప్పదని కామెంట్ చేస్తున్నారు. అజర్‌బైజాన్ అనే దేశంలో ఈ ఇల్లు ఉంది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఈ ఇల్లు మట్టితో చేశారు. బయట నుంచి చూస్తే ఓ సాధారణ ఇల్లులాగా.. ఆ మాటకొస్తే ఓ పూరి గుడిసెలాగా కనిపిస్తుంది. కానీ లొపలి దృశ్యం మాత్రం షాకిచ్చేలా ఉంది. ప్రధాన ద్వారం కర్టెన్ దాటుకుని లోపలికి వెళితే మొదట తివాచీ పరిచి ఉన్న పెద్ద హాల్ ఆశ్చర్యం కలిగిస్తుంది.

Viral: నాలుగు కాళ్లున్న పామును ఎప్పుడైనా చూశారా? షాకింగ్ వీడియో!


తివాచీతో పాటు ప్లాస్టరింగ్ చేసిన గోడలు, నీట్‌గా సర్దిన వస్తువులన్నీ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఖరీదైన ఇళ్లను తలపించేలా లోపలి భాగాన్ని డెకరేట్ చేశారు. హాల్‌కు ఓవైపున ఉన్న గదిలో హీటర్ కనిపిస్తుంది. మరో చోట వ్యాక్యూమ్ క్లీనర్, అద్దాలు, చిన్న చిన్న వర్ణచిత్రాలు కూడా కనిస్తాయి. లోపల పలువురు కూర్చునేందుకు సరిపడా జాగా ఉండటం మరో కొసమెరుపు. ఎల్‌ఈడీ బల్బ్ కాంతి వెలుగులో ఇల్లు మొత్తం మెరిసిపోతూ కనిపిస్తుంది (The Inside View Of This Shabby Looking Mud House In Azerbaijan Shocks Internet).

ఈ వీడియో చూసి జనాలు సహజంగానే ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి సీన్ తామెప్పుడూ చూడలేదని అనేక మంది కామెంట్ చేశారు. లోపల ఇన్ని సౌకర్యాలు ఉంటాయని అస్సలు ఊహించలేదని మరో వ్యక్తి కామెంట్ చేశారు. పుస్తకం చదవకుండా కవర్ చూసి ఓ నిర్ణయానికి రాకూడదనే సామెతకు అసలైన అర్థం ఇదేనని కొందరు అన్నారు. కాగా, అజర్‌బైజాన్‌లో కొన్ని గ్రామాల్లో ఇలాంటి ఇళ్లు నిర్మించుకుంటారని తెలుస్తోంది.

Read Viral and Telugu News

Updated Date - May 17 , 2024 | 05:41 PM

Advertising
Advertising