Viral: ఎలా వస్తాయిరా బాబూ ఇలాంటి ఐడియాలు.. ఈ వెరైటీ వంటకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN, Publish Date - Jan 27 , 2024 | 01:52 PM
వెరైటీ ఫుడ్స్ కి ఇండియా కేరాఫ్ అడ్రస్. గల్లీ నుంచి దిల్లీ వరకు ఎక్కడ చూసినా ఘుమఘుమలే. నోట్లో వేసుకోగానే కమ్మగా కరిగిపోయే మిఠాయిల నుంచి ఘాటు నశాళానికి అంటించే బిర్యానీల వరకు ఎన్నో రుచులు మన సొంతం.
వెరైటీ ఫుడ్స్ కి ఇండియా కేరాఫ్ అడ్రస్. గల్లీ నుంచి దిల్లీ వరకు ఎక్కడ చూసినా ఘుమఘుమలే. నోట్లో వేసుకోగానే కమ్మగా కరిగిపోయే మిఠాయిల నుంచి ఘాటు నశాళానికి అంటించే బిర్యానీల వరకు ఎన్నో రుచులు మన సొంతం. అంతే కాకుండా ఒక్కో ప్రాంతానికి ఒక్కో వంటకం ఫేమస్. ఆయా ప్రాంతాలకు వెళ్లిన వారు వాటిని ఓ పట్టు పట్టందే వదిలిపెట్టరు. అందుకే పాకశాస్త్ర నిపుణులు.. వంటల్లో విప్లవాలు సృష్టిస్తుంటారు. రకరకాలుగా ప్రయత్నిస్తూ సరికొత్త రుచులను పరిచయం చేస్తుంటారు. అవి ఒక్కో సారి బాగా క్లిక్ అయితే.. కొన్ని సార్లు బెడిసికొడతాయి. ప్రస్తుతం ఓ వంటకానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
రెండు నిమిషాల్లో తయారైపోయే మ్యాగీ గురించి తెలియని వారు ఎవరూ ఉండరేమో. వేగంగా, సులభంగా తయారు చేయగల నూడిల్స్‌కు మ్యాగీ చాలా ఫేమస్. ఐస్ క్రీం డిసర్ట్ కూడా చాలా మందికి ఫేమరెట్ ఫుడ్ ఐటమ్. వీటిని వేర్వేరుగా తింటేనే ఆ రుచిని ఆస్వాదించగలం. కానీ వైరల్ అవుతున్న ఈ వీడియోలో మాత్రం.. ఓ వ్యక్తి.. ట్రేలో మ్యాగీ నూడిల్స్ ను వేయడాన్ని చూడవచ్చు. ఆ తర్వాత ఐస్ క్రీం డిసర్ట్ ను వేశాడు. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి రోల్స్ లాగా చేశాడు. అనంతరం వాటిని ఓ ప్లేట్ లో పెట్టి వాటిపై చాకొలెట్ ఎసెన్స్ వేసి కస్టమర్ కు అందించాడు. ఆ వెరైటీ డిష్ చూసి.. సదరు కస్టమర్ కు ఫ్యూజులు ఎగిరిపోయాయి.
ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వంటలతో చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేయవద్దని కోరుతున్నారు. పాకశాస్త్ర తర్కాన్ని ధిక్కరిస్తున్నారని మండిపడుతున్నారు. నొప్పి లేకుండా చనిపోవాలంటే ఈ డిష్ ను టేస్ట్ చేయాలని ఘాటు రిప్లైలు ఇస్తున్నారు.
Updated Date - Jan 27 , 2024 | 01:56 PM