ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

iCloud: యాపిల్ ప్రొడక్ట్స్ వాడుతున్నవారికి అదిరిపోయే టిప్స్.. ఇవి పాటిస్తే చాలు

ABN, Publish Date - Oct 30 , 2024 | 12:50 PM

యూపిల్ పరికరాలను వాడేవారు తమ ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ వంటి వ్యక్తిగత డేటా స్టోర్ చేసుకోవడానికి ఐక్లౌడ్‌‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ప్రొటెక్షన్ బాగానే ఉన్నప్పటికీ ఈ డివైజ్ కూడా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి యూజర్లు కొన్ని టిప్స్‌ను పాటిస్తే ప్రొటెక్షన్ పెరుగుతుంది. ఆ టిప్స్ ఇవే

ఐఫోన్ (iPhone), ఐప్యాడ్ (iPad), మ్యాక్‌బుక్ (MacBook) వంటి యాపిల్ ఉత్పులను వాడుతున్న యూజర్లు తమ ఫొటోలు, డాక్యుమెంట్లు, అప్లికేషన్లు వంటి వాటిని స్టోర్ చేసుకోవడానికి ఐక్లౌడ్‌ను (iCloud) ఉపయోగిస్తుంటారు. ఇది డిజిటల్ లాకర్ లాగా పనిచేస్తుంది. వినియోగాన్ని సులభతరం చేస్తూ అన్ని యాపిల్ డివైజ్‌లను సింక్ చేస్తుంది. తద్వారా యూజర్లు మరింత సులభంగా సేవలను పొందే వీలు ఏర్పడింది. అయితే ఐక్లౌడ్‌ హ్యాక్‌కు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యక్తిగత డేటాను రక్షించుకోవాలంటే ఇలాంటి హ్యాకింగ్‌లు జరగకుండా అప్రమత్తడం అవడం చాలా ముఖ్యం. నిపుణులు సూచిస్తున్న ఈ చిట్కాలను పాటిస్తే హ్యాకింగ్ ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు.


2-ఫ్యాక్టర్ అథెంటికేషన్..

హ్యాకింగ్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనెబుల్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎనెబుల్ చేసుకుంటే యాపిల్ డివైజ్‌లకు అదనపు ప్రొటెక్షన్ జోడించినట్టు అవుతుంది. కాబట్టి యూజర్లు వారి డివైజ్‌లలో 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ యాక్టివేట్ అయ్యిందో లేదో పరిశీలించుకోవాలి. ఐక్లౌడ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.


ఇక పాస్‌వర్డ్‌లు చాలా స్ట్రాంగ్‌గా ఉండేలా చూసుకోవాలి. డివైజ్‌లకు తగిన ప్రొటెక్షన్ ఇవ్వడంలో పాస్‌వర్డ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. కొంతమంది బర్త్‌ డే తేదీలు, సాధారణ పదాలను ఉపయోగిస్తుంటారు. అలా చేయడం ఉపయోగకరం కాదు. పాస్‌వర్డ్‌లో స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, స్పెషల్ క్యారక్టర్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. సెక్యూరిటీ ప్రక్రియలో ఉండే ప్రశ్నలకు జవాబుల ఫీల్డ్‌లో కూడా సమాధానాలు భద్రతను బలపరిచేలా ఉండాలి.


అధునాతన డేటా ప్రొటెక్షన్ ఆన్ చేయాలి

యాపిల్ కంపెనీ అడ్వాన్స్‌డ్ డేటా ప్రొటెక్షన్‌లో భాగంగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తుంది. సురక్షితమైన ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేసుకోవడం మంచిది. ఐక్లౌడ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ ఫీచర్‌ని యాక్టివేట్ చేసుకోవాలి. అకౌంట్‌కు యాక్సెస్‌ లేకుంటే రికవరీ కీని సెటప్ చేయాల్సి ఉంటుంది.


మరిన్ని టిప్స్ ఇవే..

ఫిషింగ్ స్కామ్‌ల పట్ల యూజర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. హ్యాకర్లు ఐక్లౌడ్‌లోకి సింక్ అవడానికి ప్రయత్నిస్తుంటారు. ఫేక్ మెయిల్స్, టెక్స్ట్‌ మెసేజులను పంపుతుంటారు. పొరపాటున ఎంటర్ అయ్యారో వ్యక్తిగత డేటా, ఫోటోలు, వీడియోలు, బ్యాంక్ వివరాలు ఇలా అన్నింటినీ తస్కరిస్తారు. మరోవైపు డివైజ్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. సాఫ్ట్‌వేర్లు అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అప్‌డేట్ అవుతూ ఉంటే ప్రొటెక్షన్ పెరుగుతుందని అర్థం.


ఇక మాల్వేర్‌బైట్స్ వంటి ప్రొటెక్షన్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించడం మంచిది. ఇక పబ్లిక్ వైఫైలను కూడా ఉపయోగించకూడదు. ఎందుకంటే పబ్లిక్ వైఫైలు అంత సురక్షితమైనవి కాదు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌బుక్‌లను హ్యాక్ చేయడానికి సులభమైన మార్గాల్లో ఇది కూడా ఒకటని చెప్పాలి.


ఇవి కూడా చదవండి

నవంబర్‌లో బ్యాంకులకు చాలా హాలిడేస్.. ఎప్పుడెప్పుడంటే

ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూక్లియర్ డ్రిల్‌ మొదలు పెట్టిన రష్యా.. ఏం జరగబోతోంది

ఇరాన్‌కు సంచలన వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్.. టెన్షన్ టెన్షన్

పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని వృద్ధులకు ప్రధాని మోదీ క్షమాపణలు.. కారణం ఎందుకంటే..


For more Business News and Telugu News

Updated Date - Oct 30 , 2024 | 01:01 PM